రేడియో స్వగతం..

అది…1886… ఇటలీ…
మార్కోని అనే ఒక ఇరవై ఏళ్ల పిలగాడు,
నన్ను సృష్టించాడు.
నేనేంటి? నా మాటలేంటి??
సముద్రాలు దాటి వినపడ్డాయి.
ఇంకొంచెం పెద్దయ్యాను…
రెండో ప్రపంచ యుద్ధంలో
సైనికులు నన్ను వేలి పట్టుకొని తీసుకెళ్లారు.
విమానాల పైలెట్లు, నౌకల కెప్టెన్లు, ట్రక్ డ్రైవర్లు, పోలీసులు
అందరూ నన్ను పక్కనే కూర్చొనేంత క్లోజ్ ఫ్రెండయ్యాను.
అంతకుమించి,
గొప్ప గొప్ప వాళ్ల ఉపన్యాసాలకు వేదికయ్యాను.
వార్తలు అందిస్తూ…
పాటలు పాడుతూ, ముచ్చట్లు చెప్తూ
ప్రతి ఇంటికి ఒక ఫ్యామిలీ మెంబర్ అయ్యాను.
భూగోళం… అబాలగోపాలం….
అందరూ నా ప్రేమలో పడిపోయారు.
ఇంతకీ నా పేరేంటో చెప్పలేదు కదా?… రేడియో!


శతాబ్దానికిపైగా శ్రోతల ఊహాలకు రూపమిస్తూ,
శ్రోతల మనసుకు ఆహ్లాదాన్ని పంచుతూ సంగీత, సమాచార ప్రసారసాధనంగా ఎదిగిన రేడియోకి,
ప్రేమతో…

– గణేశ్ తండ(కనీసం ఒక్కసారైనా రేడియోలో పనిచేయాలని కలలు కన్న…)

 

Optimized by Optimole