అధిక వేడి ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. కొంతమంది వ్యక్తులు చిన్న పిల్లలు, వృద్ధులు, నిరాశ్రయులైన వ్యక్తులు వేడి మూలానా చురుకుగా ఉండాలేకపోతున్నారని ఓ అధ్యయనం తెలిపింది. శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులపై వేడి తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అధిక వేడి సమస్య ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు. సాధారణంగా తీవ్రమైనది కాదు.. కానీ దీర్ఘకాలికంగా అవయవాలపై ప్రభావం చూపి మరణానికి దారితీయవచ్చని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌లో పర్యావరణ ఎపిడెమియాలజిస్ట్ షకూర్ హజత్ అన్నారు.
గత సంవత్సరం ది లాన్సెట్ జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. అధిక వేడి కారణంగా సంవత్సరానికి కేవలం అర మిలియన్ మరణాలు సంభవిస్తాయని అంచనా వేయబడింది. కోవిడ్ రోగులపై ఎలాంటి ప్రభావం చూపినట్లు ఇంకా ఎటువంటి ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు తెలిపారు.
లక్షణాలు :
– తలనొప్పి, తలనొప్పి, వణుకు ,అధిక దాహం, అలసట
– వేగంగా శ్వాస తీసుకోవడం,చిరాకు, మూర్ఛ, వికారం
నిపుణులు ఏమంటున్నారంటే..?
– గర్భిణీ స్త్రీలు నెలలు నిండకుండానే ప్రసవానికి దారితీస్తున్నట్లు అనేక అధ్యయనాలు తెలుపుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
– ఆత్మహత్యల రేట్లు .. మానసిక ఆరోగ్య సమస్యలు తరచుగా పెరుగుతాయని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పర్యావరణ అధ్యాపకుడు లారెన్స్ వైన్‌రైట్ అన్నారు.
– అధిక వేడిమి సమస్య వలన వేసవిలో ఎక్కువ మరణాలు సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
– ఐరోపాలోని కొన్ని ప్రాంతాలతో సహా.. వేడిని ఉపయోగించని ప్రదేశాలలో ప్రజలు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారని నిపుణులు తెలిపారు.
సలహాలు :
– అనేక యూరోపియన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీలు.. సాధ్యమైనంత వరకు శరీర శ్రమను తగ్గించాలని సూచిస్తున్నాయి. చల్లని ప్రదేశంలో ఉండటం.. తీవ్రమైన ఒత్తిడికి గురికాకుండా కూల్‌గా ఉండటానికి కూడా ప్రయత్నించాలని తెలుపుతున్నాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వైద్యున్ని సంప్రదింస్తే మేలంటున్నాయి.
– చక్కని డైట్‌తో పాటు చేపలు, కోడిగుడ్లు, ఆకుకూరలు తినాలి. కాఫీ, టీలను తగ్గించాలి. ఏమాత్రం చర్మం అబ్‌నార్మల్‌గా అనిపించినా డాక్టర్‌ను సంప్రదించాలి.
_ నాన్‌వెజ్ తగ్గించాలి. పీచుపదార్థం ఉండే ఆహారం తీసుకోవాలి. అందుకే నీటిశాతం ఎక్కువ ఉండే వాటర్‌మెలన్, కర్భూజలాంటి సీజనల్ ఫ్రూట్స్ తినాలి. తాజా కూరగాయలు, మజ్జిగ, సిట్రస్ పండ్లు(నిమ్మరసం, నారింజ), పెరుగన్నం తినటం మంచిది.
– స్విమ్మింగ్ వల్ల శరీర ఉష్ణోగ్రత కాస్త మేర తగ్గుతుంది
– గాలి బాగా ఆడే చోట కూర్చోవాలి. తగినంత ఆక్సిజన్ అందే పరిస్థితి లేకపోతే శరీరంలో మార్పులు చోటుచేసుకుని బాడీ టెంపరేచర్ పెరగినట్లు అనిపిస్తుంది. ఫ్యాన్ కింద, కూలర్ల వద్ద కొన్ని నిమిషాలు కూర్చోవాలి.