ఆస్తమా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?

దీర్ఘకాలిక శ్వాససంబంధ రుగ్మతల్లో ఆస్తమా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరీకి వచ్చే అవకాశ ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలపై ప్రభావం చూపే అకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి, బయటకు రావడానికి వాయు నాళాలు ఉంటాయి. వివిధ కారణాల వల్ల కండరాలు వాపుతో వాయునాళాలల్లో సమస్య తలెత్తినప్పుడు..శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో ఏదైనా పనిచేసినా.. కాసేపు నడిచినా, ఆయాసం వచ్చేస్తుంది. ఈసమస్యతో బాధపడే వారిలో కనిపించే లక్షణాలు శ్వాసలో గురక, ఛాతీ బిగుతు, శ్వాస ఆడకపోవడం దగ్గు రావడం.

భారత్ లో ఆస్తమా సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం.. ఒక్క మనదేశంలోనే 1. 5 కోట్ల నుంచి 2 కోట్ల మంది బాధితులు ఉన్నట్లు అంచనా. చిన్నారుల్లో 100 కి 5 నుంచి 15 మంది ఆస్తమా బారిన పడుతున్నారు. మరి ఇంతలా కలవరపెడుతున్న ఈసమస్య ఎలా అధిగమించాలి? చేయాల్సిందేమిటి? అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందో తెలుసుకుందా!

 

చికిత్స:

ఆస్తమా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యున్ని సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచింది. తద్వారా సమస్య తీవ్రతరం కాకుండా నయం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా విటమిన్ డీ ఉండే పదార్థాలు తీసుకోవాలి. లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు తక్షణం ఉపశమనం పొందేందుకు రిలీవర్ మందులు వాడాలి. ఈ మందులను వేసుకునేందుకు ఇన్‌హేలర్ పరికరాన్ని వెంటే ఉంచుకోవాలి.అయితే వీటిని వైద్యుని సలహా మేరకు తీసుకోవడం మంచింది.

జంక్ ఫుడ్ తీసుకునే వారు అధికంగా ఈసమస్య బారిన పడే అవకాశం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 50 దేశాలకు చెందిన 5 లక్షల మంది చిన్నారులపై ఓ అధ్యయనం నిర్వహించగా.. వారంలో మూడు సార్లు ఫాస్ట్ ఫుడ్ తినే చిన్నారుల్లొ ఆస్తమా, చర్మ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశమున్నట్లు పరిశోధనలో తేలింది.

ఆస్తమా బాధితులపై ప్రభావం చూసే ప్రధాన సమస్య నిద్రలేమి. రాత్రి సమయాల్లో వీరిని దగ్గు తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. కాలక్రమేణా తీవ్ర పరిణామాలకు దారి తీసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈసమస్యతో బాధపడుతున్న వారు డ్రైవింగ్ చేసే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.