బొజ్జ రాజశేఖర్ సీనియర్ జర్నలిస్ట్: తెలంగాణలో రాజకీయం రంజుగా మారింది. అసెంబ్లీ ఎన్నికల గడువు ముంచుకొస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు బహిరంగ సభలతో వేడి పుట్టిస్తున్నాయి. బహిరంగ సభల్లో ప్రజలకు మేలు చేసే హమీల కన్నా.. ఒకరిపై మరోకరు బురద చల్లడమే పనిగా నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ చేవేళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లెరేషన్ పేరుతో సభ నిర్వహించగా.. పట్టులేని ఖమ్మంలో రైతు గోస.. బీజేపీ భరోసా పేరుతో కాషాయం పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ రెండు జాతీయ పార్టీలు అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ను కార్నార్ చేస్తు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ సభలతో తెలంగాణ ప్రజలకు ఓరిగిందేమి లేదు. అమలుకు సాధ్యం కానీ కాంగ్రెస్ డిక్లెరేషన్, ఖాళీ కుర్చేలతో కుదేలైన బీజేపీ సభలు కంటితుడుపుగానే కొనసాగాయి.
హామీ అమలు సాధ్యమేనా..?
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయకుండా తెలంగాణలోనే అమలు చేస్తామని చేవేళ్ల సభలో ఎస్సీ, ఎస్టీ డీక్లెరేషన్ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ప్రకటించారు. ఎస్టీలకు ఎస్టీ బంధు రూపంలోరూ. 12 లక్షలు అందిస్తామని, ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, అసైన్డ్ భూములకు పట్టాలు, ఎస్సీ, ఎస్టీలకు మూడేసి కార్పోరేషన్లు ఏర్పాటు చేస్తామని ఖర్గె సభా వేదికగా వెల్లడించారు. అయితే కాంగ్రెస్ ఇస్తామంటున్న హమీలను ముందుగా ఆ పార్టీ అధికారంలో రాష్ట్రాల్లో ఇచ్చి తెలంగాణలో హమీ ఇవ్వాలని అధికార పార్టీ బీఆర్‌ఎస్ నేతలు ఎద్దేవ చేస్తూ కామెంట్లు విసురుతున్నారు.ఇదే విషయంపై జాతీయ బీజేపీ నాయకుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాm. ఖమ్మం నుంచి మాట్లాడుతూ మల్లికార్జున్ ఖర్గె చేవేళ్లలో చెప్పినవన్ని అబద్దాలే అంటు విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హమీలను ఎస్సీ, ఎస్టీలు ఏమేరకు నమ్ముతారు? అన్నది అసెంబ్లీ ఎన్నికల్లో తేలనుంది.
సాధించింది ఏమి లేదు..ఎదుటివారినితిట్టడమే..
తెలంగాణలో ఉనికి కోసం బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. పెద్దగా క్యాడర్ లేకపోయిన తాము పోటీలో ఉన్నామనే బల ప్రదర్శనలకు జాతీయ స్థాయిలోని దిగ్గజాలను బహిరంగ సభలకు తరలిస్తున్నారు. ఖమ్మంలో జరిగిన బీజేపీ రైతు గోస..బీజేపీ భరోసా పేరుతో నిర్వహించిన సభకు ఆశించిన స్థాయిలో జనాలు రాలేదని నిరాశ వారిలో ఉన్నా .. అమిత్ షా మాత్రం తనదైన శైలీలో మాటల తూటాలను పేల్చారు. కేసీఆర్ స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందని, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గె మాటలు పచ్చి అబద్దాలుగా ఉన్నాయని అన్నారు. ఈ రెండు బహిరంగ సభలతో తెలంగాణ ప్రజలకు వచ్చిన లాభాలైతే ఏమి లేవు కాని..బీఆర్‌ఎస్ ప్రతిపక్ష పార్టీలైనా కాంగ్రెస్, బీజేపీ ఉనికి చాటుకున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.