Nancharaiah merugumala 🙁 senior journalist)
==================
H (ఎచ్/హెచ్) తో మొదలయ్యే మాటల్లో Hindutva తర్వాత ఇప్పుడు భారతదేశంలో పెద్ద స్థాయిలో ప్రాచుర్యం పొందుతున్న మాట Hindenburg (హిండన్ బర్గ్). జర్మన్ సంస్థకు చెందిన ఎయిర్ షిప్ హిండన్ బర్గ్ (1937 ప్రమాదంలో అమెరికా న్యూజెర్సీలో కూలిపోయింది) పేరుతో అమెరికాకు చెందిన నాథన్ (నేట్) ఆండర్సన్ స్టాక్ మార్కెట్ పరిశోధనా సంస్థ నెలకొల్పి, ప్రపంచం కుబేరుల్లో మూడో స్థానం సంపాదించిన భారత బిలియనీర్ గౌతమ్ ఆదానీ కంపెనీల లొసుగుల్ని వెల్లడించాడు. దీంతో గత మూడు రోజులుగా హిండన్ బర్గ్ అనే మాట హిందుత్వ అనే పాత పదానికి మించిన స్థాయిలో ఇండియాలో పాపులారిటీ సంపాదిస్తోంది.