కర్ణాటకలోని వాటర్ ఫాల్స్ చూశారా ఎప్పుడైనా ..?

వర్షకాలంలో ప్రకృతి పారవశ్యంతో పరవశిస్తోంది. సరికొత్త అందాలతో పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఇక కర్ణాటకలో ఉన్నట్లువంటి వాటర్ ఫాల్స్ (జలపాతాల) దగ్గర ప్రకృతి ప్రేమికలతో సందండి వాతావరణం కనిపిస్తోంది. మరీ ఆరాష్ట్రంలో ఉన్నటువంటి జలపాతాలపై మనము ఓ లుక్కెద్దాం!

హనుమాన్ గుండి జలపాతం:

హనుమాన్ గుండి జలపాతాన్ని స్థానికంగా సుతనబ్బి జలపాతం అని కూడా పిలుస్తారు, ఇది కుద్రేముఖ్ నేషనల్ పార్క్‌కు దగ్గరగా ఉన్నటువంటి జలపాతం. 77 అడుగుల ఎత్తు నుంచి దూకే నీటిసవ్వడులు..భూతల స్వర్గాన్ని తలపిస్తోంది. వర్షాకాలంలో ఇక్కడి పర్యాటకులు భారీగా తరలివస్తుంటారు.

గోకాక్ జలపాతం:

నయాగర జలపాతాన్ని తలపించే జలపాతం గోకాక్ జలపాతం. ఇది గోకాక్ నగరానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి ప్రత్యేకత ఘట్టప్రభ నదిపై 200 మీటర్ల పొడవైన వేలాడే వంతెన. 52 మీటర్ల నుంచి జలసవ్వడులు పర్యాటకులను ఆకర్షిస్తాయి.

కొడిగే జలపాతం: 

కొడిగే జలపాతం ముదిగెరెచిక్క మగళూరు జిల్లా దుర్గాదహళ్లి గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి అద్భుతమైన జలపాతం. పాలునురుగులా ప్రవహించే జలపాతం అందాలు ప్రకృతి ప్రేమికులను మైమరిపిస్తున్నాయి.దట్టమైన అడవి మధ్యలో కాఫీతోటల గుండా ఈజలపాతాన్ని చేరుకోవచ్చు. ఇక్కడి ప్రకృతి దృశ్యాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

జరి జలపాతం;
జరిజలపాతాన్ని మజ్జిగె జలపాతం అని కూడా పిలుస్తారు, ఇది చిక్కమగళూరు జిల్లాలోని బాబాబుదనగిరి నుండి 12 కిలోమీటర్ల దూరంలో అత్తిగుండికి సమీపంలో ఉంది. వర్షకాలం వచ్చిదంటే చాలు సహజంగానే జలపాతం అందాలను ఆస్వాదించే వాతావరణాన్ని సృష్టిస్తాయి. జలపాతం భూమిని తాకుతూన్నట్లు కనిపించే దృశ్యం పర్యాటకులకు కనువిందు చేస్తోంది. జలపాతం చుట్టు ఉంటే కాఫీ తోటలు , పక్షుల కిలకిలరాగాలు మంత్రముగ్దులను చేస్తాయి. కర్ణాటక స్విట్జర్లాండ్ అని పిలువబడే చిక్కమగళూరుకు నుంచి ఇక్కడికి ప్రయాణించేందుకు వీలుంటుంది.

శివగంగ జలపాతం:
ఉత్తర కన్నడ ప్రాంతంలో పుట్టి, పశ్చిమ కనుమలలోని దట్టమైన అడవుల గుండా స్వేచ్ఛగా ప్రవహించే సోండా నది.. శిరసికి దగ్గరగా ఉన్న శివగంగ జలపాతాన్ని ఏర్పరుస్తుంది. ఎడారిగా ఉన్న అడవి మధ్యలో ప్రవహించే జలపాతం యొక్క అందాలను చూస్తే మీరు మైమరిచిపోతారు. ఇక్కడి దృశ్యాలను చూడడానికి పర్యాటకులు వందల కొద్ది తరలివస్తుంటారు.

కాదంబి జలపాతం :
చిక్కమగళూరులోని అందమైన, చెట్లతో కూడిన కుద్రేముఖ్ పర్వత శ్రేణులలో ఉన్నది కాదంబి జలపాతం. పాలనురుగు వంటి రాళ్లపై 30 అడుగుల ఎత్తు నుంచి దూకే నీటిసవ్వడులు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. వర్షాకాలంలో విహారయాత్రకు వెళ్ళడానికి ఒక గొప్ప అనువైన ప్రదేశం. ఎందుకంటే మీరు అక్కడ ఈత కొడుతూ ప్రకృతితో అస్వాదించేందుకు వీలుంటుంది. జలపాతం ముందు ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జి నుంచి కాదంబి జలపాతం యొక్క అద్భుతమైన దృశ్యాలను చూస్తుంటే..భూతల స్వర్గం చూస్తున్నఅనుభూతి కలుగుతుంది.

మాగోడు జలపాతం:
ఉత్తర కన్నడ జిల్లాకు 3 కిలో మీటర్ల దూరంగా మాగోడు జలపాతం ఉంది. ఇది చంద్రవంక రూపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. సుమారు 650 అడుగుల ఎత్తు నుంచి దూకే వాటర్ ఫాల్స్ దృశ్యాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. మనోహరమైన అందాలను అనుభవించడానికి.. మొక్కలు, చెట్లు, తీగలు, పువ్వుల సువాసనలను ఆస్వాదించడానికి, జంతువులు, పక్షుల సందడిని వినడానికి.. పచ్చని అడవి మధ్య ఉన్నటువంటి మాగోడు జలపాతాన్ని సందర్శించండి.