తెలంగాణలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం : వాతావరణ శాఖ

బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం రాగల 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తెలంగాణలో రేపు
ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు.నిన్న ఏర్పడిన అల్పపీడనం ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడి మధ్య ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలోకి ఈశాన్య దిశ నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని తెలిపారు. సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ. ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్నారు.