యూపీ కాన్పుర్‌లో జికా వైరస్ వ్యాప్తి సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 105కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ కాన్పూర్‌లో బుధవారం పర్యటించనున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించనున్నారు.