టిఎస్ఆర్టీసిని కించపరిచే విధంగా ప్రకటనలో నటించిందుకు హీరో అల్లు అర్జున్‌కు, ర్యాపిడో సంస్థకు లీగల్ నోటీసులు పంపినట్లు తెలిపారు టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. ఆ ప్రకటనలో ఆర్టీసీ బస్సులను దోసెలతో పోల్చారని.. దీంతో ప్రయాణికులు, ఆర్టీసీ ఉద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయన్నారు. ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆర్టీసీని కించపరిస్తే సంస్థ, ఉద్యోగులు, ప్రయాణికులు సహించరని చెప్పారు. టీఎస్ ఆర్టీసీ సామాన్యుల సేవలో ఉందన్న సజ్జనార్.. ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనల్లో నటీనటులు నటించాలన్నారు.