ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..!

తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ళపై బీజేపీ, టీఆర్ ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బియ్యం కొనుగోళ్లపై స్పష్టత ఇచ్చారు. సాధారణ బియ్యాన్ని దశల వారీగా కొనుగోలు చేస్తామని ఆయన వెల్లడించారు.సీఎం కేసిఆర్ ధాన్యం, బియ్యం విషయంలో రైతులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.
దేశవ్యాప్తంగా చూసినట్లయితే పంజాబ్ తర్వాత తెలంగాణ నుంచే కేంద్రం ఎక్కువుగా బియ్యం కొంటుందన్నారు. ఉప్పుడు బియ్యాన్ని రాష్ట్రంలో తినరని.. కేరళలోనూ వాడకం తగ్గినందున్న అబియ్యాన్ని కొనలేమని కేంద్రం.. గతంలోనే స్పష్టం చేసిందని గుర్తు చేశారు.
ఇక 2014లో కేంద్రం.. తెలంగాణ నుంచి 43 మెట్రిక్ టన్నుల బియ్యం సేకరిస్తే…2021లో 94 ఎల్ఎంటిలకు పెరిగిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.రాష్ట్రం నుంచి 2014లో 3 వేల 404 కోట్లు వెచ్చింస్తే..2021లో 26 వేల 641 కోట్లకు పెరిగినందని చెప్పుకొచ్చారు.
కాగా ఆగస్ట్ 17 న కేంద్రం,రాష్ట్రాల పౌర సరఫరాల శాఖ కార్యదర్శుల సమావేశంలో రాష్ట్రం నుంచి 40 ఎల్ఎంటి బియ్యం సేకరించాలని ఒప్పందం జరిగిందని కేంద్ర మంత్రి తెలిపారు.అయితే రాష్ట్ర ప్రభుత్వం 90 ఎల్ఎంటి బియ్యం సేకరించాలని కేంద్రానికి లేఖ రాసినట్లు వెల్లడించారు.