ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఎపిసోడ్ ..ఒక్కరు మున్నూరు కాపు ఉన్నా కథకు ‘విశ్వసనీయత’ ఉండేదేమో!

Nancharaiah merugumala:(Editor)

===================

ముగ్గురు’ బేరగాళ్లలో ఇద్దరు బ్రామ్మలా? అన్యాయం!

————/————/———-/

తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు నలుగురికి ‘ప్రలోభ పెట్టడానికి’ ప్రయత్నించిన ముగ్గురిలో ఇద్దరు (సతీష్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి, సింహ యాజీ స్వామి) దైవ సన్నిధిలో గడిపే పూజారులుగా పనిచేసే సాద్బ్రాహ్మణులు అని వార్తలొచ్చాయి. హరియాణాలోని ఫరీదాబాద్ లో పూజారి సతీష్ శర్మ. కర్ణాటక రాయచూరులో టీచర్ వృత్తి మానుకుని తిరుపతిలో దేవుడి పూజలు చేయించే పసుపు బట్టల స్వామి సింహ యాజీ. వైష్ణవుడు. మూడో ‘అనుమానితుడు’ నంద కుమార్ ఉరఫ్ నందూ కూడా కన్నడిగుడే. అయితే, నందూ శివుణ్ణి నమ్ముకున్న లింగాయతుడని చెబుతున్నారు. ఈ ముగ్గురిలో ఇద్దరు దైవసేవకు అంకితమైన ‘పురోహితులు’. రాముడిని నమ్ముకుని 2014లో దిల్లీ పీఠం ఎక్కిన సంఘ్ పరివార్ పార్టీ బీజేపీ పార్టీ ఫిరాయింపు అనే పాపకార్యానికి ఇద్దరు దైవసేవకులను ‘వినియోగించిందంటే’ హిందుత్వపక్ష వ్యతిరేకులు సయితం నమ్మలేకపొతున్నారు.

తెరాస ఎమ్మెల్యేల్లో ఒక్క మున్నూరు కాపు ఉన్నా ఈ కతను జనం నమ్మేవారు

…………………………………………………

మొయినాబాద్ దగ్గర అజీజ్ నగర్ ఫామ్ హౌస్ లో కనిపించిన నలుగురు తెరాస శాసనసభ్యుల్లో ఒక మున్నూరు కాపు సోదరుడో లేదా ఒక పద్మనాయక వెలమ అన్నయ్యో ఉన్నా …బీజేపీ ప్రలోభ ప్రయత్నాన్ని- తెలివైన తెలంగాణ జనం సైతం నమ్మేసేవారు. వారిలో ఇద్దరు ( పంజుగుల ‘పైలట్’ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి) రాష్ట్రంలో అధికారానికి ఎనిమిదేళ్ల నుంచి శాశ్వతంగా దూరమైన రెడ్డి సామాజిక వర్గం వారు కావడం అత్యంత దయనీయ పరిణామం. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు (రేగా కాంతారావు)  ఆదివాసీ, మరొకరు (గువ్వల బాలరాజు) దళితుడు కావడం కూడా అత్యంత దురదృష్టకరం. పేకాటలు, కాసినోలు నడపాల్సిన ఫామ్ హౌస్ లో బేరమాడడానికి ఎంచుకున్న ఎమ్మెల్యేల్లో నేడు తెలంగాణలో అత్యంత చలనశీలమైన స్వభావం ఉన్న వారిగా నిరూపించుకున్న మున్నూరు కాపు సోదరులు, వెలమ దొరలు లేకుండా జాగ్రత్త పడడం కాషాయ శిబిరం దిమాగ్ ఎంత పదునైనదో అర్ధం చేసుకోవచ్చని కొందరు కోస్తా జిల్లాల అమాయక విశ్లేషకులు అంటున్నారు.’నలుగురు’లో ఒక్కరు మున్నూరు కాపు ఉన్నా కథకు ‘విశ్వసనీయత’ ఉండేదేమో!
‘ముగ్గురు’ బేరగాళ్లలో ఇద్దరు బ్రామ్మలా? అన్యాయం!
————/————/———-/——/—–
తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు నలుగురికి ‘ప్రలోభ పెట్టడానికి’ ప్రయత్నించిన ముగ్గురిలో ఇద్దరు (సతీష్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి, సింహ యాజీ స్వామి) దైవ సన్నిధిలో గడిపే పూజారులుగా పనిచేసే సాద్బ్రాహ్మణులు అని వార్తలొచ్చాయి. హరియాణాలోని ఫరీదాబాద్ లో పూజారి సతీష్ శర్మ. కర్ణాటక రాయచూరులో టీచర్ వృత్తి మానుకుని తిరుపతిలో దేవుడి పూజలు చేయించే పసుపు బట్టల స్వామి సింహ యాజీ. వైష్ణవుడు. మూడో ‘అనుమానితుడు’ నంద కుమార్ ఉరఫ్ నందూ కూడా కన్నడిగుడే. అయితే, నందూ శివుణ్ణి నమ్ముకున్న లింగాయతుడని చెబుతున్నారు. ఈ ముగ్గురిలో ఇద్దరు దైవసేవకు అంకితమైన ‘పురోహితులు’. రాముడిని నమ్ముకుని 2014లో దిల్లీ పీఠం ఎక్కిన సంఘ్ పరివార్ పార్టీ బీజేపీ పార్టీ ఫిరాయింపు అనే పాపకార్యానికి ఇద్దరు దైవసేవకులను ‘వినియోగించిందంటే’ హిందుత్వపక్ష వ్యతిరేకులు సయితం నమ్మలేకపొతున్నారు.
తెరాస ఎమ్మెల్యేల్లో ఒక్క మున్నూరు కాపు ఉన్నా ఈ కతను జనం నమ్మేవారు
…………………………………………………
మొయినాబాద్ దగ్గర అజీజ్ నగర్ ఫామ్ హౌస్ లో కనిపించిన నలుగురు తెరాస శాసనసభ్యుల్లో ఒక మున్నూరు కాపు సోదరుడో లేదా ఒక పద్మనాయక వెలమ అన్నయ్యో ఉన్నా …బీజేపీ ప్రలోభ ప్రయత్నాన్ని- తెలివైన తెలంగాణ జనం సైతం నమ్మేసేవారు. వారిలో ఇద్దరు ( పంజుగుల ‘పైలట్’ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి) రాష్ట్రంలో అధికారానికి ఎనిమిదేళ్ల నుంచి శాశ్వతంగా దూరమైన రెడ్డి సామాజిక వర్గం వారు కావడం అత్యంత దయనీయ పరిణామం. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు (రేగా కాంతారావు) ఆదివాసీ, మరొకరు (గువ్వల బాలరాజు) దళితుడు కావడం కూడా అత్యంత దురదృష్టకరం. పేకాటలు, కాసినోలు నడపాల్సిన ఫామ్ హౌస్ లో బేరమాడడానికి ఎంచుకున్న ఎమ్మెల్యేల్లో నేడు తెలంగాణలో అత్యంత చలనశీలమైన స్వభావం ఉన్న వారిగా నిరూపించుకున్న మున్నూరు కాపు సోదరులు, వెలమ దొరలు లేకుండా జాగ్రత్త పడడం కాషాయ శిబిరం దిమాగ్ ఎంత పదునైనదో అర్ధం చేసుకోవచ్చని కొందరు కోస్తా జిల్లాల అమాయక విశ్లేషకులు అంటున్నారు.