ప్రపంచ కప్ 2023.. అడుగు దూరంలో భారత్..!

Worldcup2023: ప్రపంచకప్ _ 2023 ఫైనల్లో అతిథ్య భారత్ అడుగుపెట్టింది. ప్రపంచ కప్ అందుకోవడానికి అడుగు దూరంలో నిలిచింది. టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్.. ప్రపంచ కప్ అందుకోవడానికి అడుగు దూరంలో నిలిచింది. వాంఖడే వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన సెమీస్ మ్యాచ్లో జయకేతనం ఎగరేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ టాప్ ఆర్డర్ రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 397 పరుగుల భారీ స్కోర్ సాధించింది.యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (105) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు.  రన్ మెషిన్ విరాట్ కోహ్లి(117) పరుగులతో అదరగొట్టాడు.ఓపెనర్లు గిల్ (80), కెప్టెన్ రోహిత్ శర్మ(47) పరుగులతో రాణించారు.

అనంతరం 398 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 327 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఆ జట్టులో డారెల్ మిచెల్ (134) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ విలియమ్ సన్(69) అర్థ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్ షమీ 7 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.