ప్రపంచంలో  అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా భారత్..

ప్రపంచంలో అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా భారత్..

ప్రపంచంలో  అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. తాజాగా ఇంటర్నేషనల్ మానీటరీ ఫండ్ IMF నివేదిక ప్రకారం.. బ్రిటన్ ను వెనక్కి నెట్టి భారత్  ఐదవ స్థానంలో నిలిచింది. కరోనా మహమ్మారితో  అమెరికా , బ్రిటన్, చైనా  దేశాల ఆర్ధిక వ్యవస్థలు క్షీణిస్తుంటే భారత్ మాత్రం దూసుకుపోతోందని  నివేదిక తెలిపింది. ఈఏడాది భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7%నికి మించి ఉంటుందని IMF అంచనావేస్తోంది. 

 

కాగా  GDP పరంగా భారత ఆర్థిక వ్యవస్థ బ్రిటన్ కంటే మెరుగ్గా ఉంది. ఇప్పటివరకు ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న బ్రిటన్ ఆస్థానాన్ని కోల్పోయి ఆరోస్థానంలో కొనసాగుతోంది. సుమారు రెండు శతాబ్ధాల పాటు  వలస పాలనలో ఉన్న భారత్ ప్రస్తుతం ఐదో అతిపెద్ది ఆర్థిక వ్యవస్థగా ఎదగడం చెప్పుకోదగ్గ విషయమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. GDP పరంగా అమెరికా, చైనా, జపాన్, జర్మనీ మొదటి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

ఆర్థిక సమస్యలు, రాజకీయ మార్పులతో సతమతమవుతున్న బ్రిటన్ లో ప్రధాని ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. మరికొద్ది రోజుల్లో ఆదేశానికి కొత్త ప్రధాని రాబోతున్నాడు. ఈక్రమంలో  కొత్త ప్రధాని తీసుకునే నిర్ణయాలపైనే ఆదేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్  ఆధారపడి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.