indvszm: జింబాబ్వేతో తొలి టీ20లో భారత ఓటమి..

Teamindia: జింబాబ్వేతో  టీ20 సిరిస్ లో టీంఇండియాకి  తొలి మ్యాచ్ లోనే  పరాభవం ఎదురైంది. శనివారం  జింబాబ్వేతో  ప్రారంభమైన తొలి టీ20 లో భారత జట్టు 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన అతిధ్య  జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 115 పరుగులు చేసింది. అనంతరం 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 102 పరుగులకు ఆలౌటైంది.   స్పల్ప లక్ష్య చేధనలో భారత బ్యాటర్లు చేతులెత్తేశారు.  కెప్టెన్ గిల్ (31), వాషింగ్టన్ సుందర్(27) మాత్రమే చెప్పుకొదగ్గ పరుగులు చేశారు.  ఈవిజయంతో 5 టీ20 సిరిస్లో జింబాబ్వే 1-0 అధిక్యంలో నిలిచింది.

Optimized by Optimole