దేశంలో తగ్గుతున్న కరోనా కేసుల సంఖ్య!

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 16 వేల 51‬ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో వైరస్ తో 206 మంది మరణించారు. మహమ్మరి నుంచి 37 వేల 901 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మరోవైపు వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 7లక్షల 706 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య 1,75,46,25,710కు చేరింది.