దేశంలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు!

దేశంలో కరోనా కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. తాజాగా శుక్రవారం ఒక్కరోజే 17 వేల336 మంది వైరస్​ బారినపడ్డారు.మహమ్మారి తో13 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు కరోనా నుంచి 13 వేల29 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.60 శాతానికి చేరింది. యాక్టివ్​ కేసుల సంఖ్య 0.19 శాతంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కరోనా కేసులు పెరుగుదల దృష్ట్యా కేంద్రం టీకా పంపిణీని వేగవంతం చేసింది. గత 24 గంటల్లో అధికారులు 13,71,107 మందికి టీకాలు అందిచ్చారు. దీంతో వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,96,77,33,217 కోట్లకు చేరింది.

ఇక ప్రపంచదేశాల్లోనూ కరోనా కేసులు పెరుగుదల కనిపిస్తోంది. గత 24 గంటల్లో  7,25,222 మంది వైరస్​ బారినపడ్డారు. మహమ్మరి వలన 1,650 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి 4,63,579 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 522,639,042 కి చేరినట్లు డబ్ల్యు హెచ్ ఓ వెల్లడించింది.