దేశంలో రోజువారీ కరోనా కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో.. కొత్తగా వెయ్యి 270 మందికి వైరస్ సోకింది. 31 మంది మహామ్మరితో మరణించారు. అటు వెయ్యి 567 మంది కరోనా నుంచి కోలుకున్నారు .
మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 4 లక్షల 20 వేల 842 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం ఇప్పటివరకూ పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,83,26,35,673 కు చేరింది.