ఒక్క రోజే 2 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు!

దేశంలో కరోనా కేసులు దడ పుట్టిస్తున్నాయి. గతం వారం రోజులుగా కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,47,417 కేసులు నమోదయ్యాయి. వైరస్ ధాటికి 380 మంది ప్రాణాలు కోల్పోయారు. 84,825 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. కరోనా​ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.11 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.