వెస్టిండీస్ సిరీస్ కూ కెప్టెన్గా శిఖర్ ధావన్!

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కు జట్టును ప్రకటించింది బీసీసీఐ. జూలై 22న ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టుకు ఓపెనర్ శిఖర్ ధావన్ నాయకత్వం వహించనున్నాడు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లుకి విశ్రాంతినిచ్చారు.

ఇక జట్టులో యువ ఆటగాళ్లు దీపక్ హుడా, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి ఆటగాళ్లకు చోటు దక్కింది. రెగ్యూలర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు సైతం విశ్రాంతి ఇవ్వడంతో.. కీపింగ్ బాధ్యతల కోసం ఇషాన్ కిషన్, సంజుశాంసన్ ఎంపిక చేశారు.

వెస్టిండీస్ తో సిరీస్ కు భారత జట్టు :
శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్), సంజు శాంసన్ , రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్.