ఏక్ నాథ్ షిండేకి ఘనస్వాగతం పలికిన సతీమణి!

ఏక్ నాథ్ షిండేకి ఘనస్వాగతం పలికిన సతీమణి!

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏక్ నాథ్ షిండే తొలిసారిగా స్వస్థలానికి చేరుకున్నాడు. అతని భార్య డప్పు వాయిద్యాల మధ్య ఘనస్వాగతం పలికింది. సీఎం రాక నేపథ్యంలో ఇంటివద్ద ఏర్పాటు చేసిన డ్రమ్స్ నూ వాయిస్తూ ఆమె సందండి చేసింది. ఈవీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా మూడు వారాల మహా రాజకీయ సంక్షోబం తర్వాత షిండే తొలిసారిగా ఇంటికెళ్లారు. గత రాత్రి ఆయన థానే చేరుకోగానే.. స్వాగతం పలికేందుకు మద్దతుదారులు, శ్రేయాభిలాషులు భారీగా తరలివచ్చారు.షిండే కారు అక్కడికి రాగానే పూల వర్షం కురిపించారు.ఆయనకు స్వాగతం పలికేందుకు జనాలు గంటల కొద్ది భారీ వర్షంలోనే ఎదురుచూడసాగారు.

ఇక స్వస్థలానికి చేరుకున్న ఏక్ నాథ్.. ఆనంద్ దిఘే శక్తిస్థలంలోని ఆశ్రమంలో గల శివసేన ఐకాన్ ఆనంద్ దిఘేకి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే సిద్ధాంతాన్ని విశ్వసించే వారికి న్యాయం చేసేందుకు తన తిరుగుబాటు చేసినట్లు స్పష్టం చేశారు.