భారత్ మరో కోవిడ్ వేరియంట్‌ను ఆందోళనకరమైన రకంగా గుర్తించింది.
భారత్లో మరో డెల్టా వెరియంట్ భయభ్రాంతులకు గురిచేస్తుంది.దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ కు కారణమైన డెల్టా వెరీయంట్ కు.. దీనికి దగ్గరి పోలికలు కనిపిస్తునాయి. డెల్టా వేరియంట్ _ A1 అనే వేరియంట్ ను మొట్టమొదట యూరప్‌లో గుర్తించారు. దీని లక్షణాలు.. సులభంగా సోకడం, తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగించడం. దీనిని యాంటీబాడీలతో అదుపు చేయడం కష్టమవడం.. వైరస్‌తో నియంత్రించడం.. చికిత్సతో నయం చేయడం కష్టమడం వంటి ప్రమాదకర లక్షణాలు ఈ కొత్త వేరియంట్‌కి ఉన్నాయి.
డెల్టా ప్లస్ వేరియంట్ అని.. ఏవై1 అని పిలిచే ఈ కొత్త వేరియంట్ చాలా తొందరగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందని, ఊపిరితిత్తుల కణాలకు ఇట్టే అతుక్కుని దాడి చేస్తుందని..మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీకి లొంగదని వైద్యుల అధ్యయనంలో తేలింది .
దేశంలో మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని 6 జిల్లాల నుంచి సేకరించిన శాంపిళ్లలోని 22 శాంపిళ్లలో ఈ డెల్టా ప్లస్ వేరియంట్‌ను ఏప్రిల్‌లో గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య వెల్లడించింది.
ఈ డెల్టా ప్లస్ వేరియంట్ అమెరికా, బ్రిటన్, పోర్చుగల్, స్విట్జర్లాండ్, జపాన్, పోలాండ్, నేపాల్, రష్యా, చైనాల్లోనూ కనిపించింది. వైరస్‌లు నిత్యం మ్యుటేట్ అవుతూనే ఉంటాయి. కొన్ని మార్పులు స్వయంగా ఆ వైరస్‌కు కూడా హాని చేసేలా ఉండొచ్చుని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
గతంలో కరోనా వైరస్ సోకినవారు.. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, టీకా తీసుకోని వారికి ఇది సోకే అవకాశాలు ఎక్కువ’ వైద్య నిపుణులు చెప్పుకొచ్చారు.