ప్రధానిగా మోడీ కే జై కొట్టిన ప్రజలు!

దేశానికి నెక్స్ట్ ప్రైమ్ ఎవరన్న దానిపై ‘ప్రశ్నమ్’ సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రధాని మోడీ కే జనం జై కొట్టారు. 12 రాష్ట్రాల్లో 20 వేల మంది ఓటర్లపై సర్వే నిర్వహించగా.. మోడీ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆయన తర్వాతి స్థానంలో రాహుల్ గాంధీ రెండవ స్థానంలో నిలిచాడు.
మోడీ, రాహుల్ తర్వాత ప్రధాని క్యాండిడేట్ గా బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి 7% .. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​కు 6.1% మంది ఓకే చెప్పారు. తమిళనాడు సీఎం స్టాలిన్​కు 3%.. అఖిలేశ్​ యాదవ్​కు 2.2% ఓట్లు వచ్చాయి. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేకు 2.1%.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్​కు 1.5%, కేరళ సీఎం పినరయి విజయన్, బిహార్ సీఎం నితీశ్ కుమార్​కు 1.4% మంది మొగ్గుచూపారు. శరద్ పవార్, కేంద్ర మంత్రి అమిత్ షాకు 0.9%, కర్నాటక సీఎం యెడియూరప్పకు 0.8%, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్​కు 0.5% ఓట్లు వచ్చాయి. నెక్స్ట్ పీఎం క్యాండిడేట్ గా సీఎం కేసీఆర్​కు 0.7% మంది మొగ్గు చూపినట్లు సర్వేలో వెల్లడైంది.

ఇటీవల ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్​తో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ భేటీలు, కాంగ్రెస్, బీజేపీ యేతర పార్టీల నేతలతోనూ చర్చల నేపథ్యంలో మళ్లీ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కాబోతోందన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో దేశానికి నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్​గా ఎవరైతే బాగుంటుందంటూ ప్రశ్నమ్ సర్వే నిర్వహించింది. ఇందులో మోడీకి దరిదాపుల్లో ఏ లీడర్​కూ స్థానం దక్కలేదు. ఇతర ప్రాంతీయ పార్టీల లీడర్లెవరిపైనా పెద్దగా జనం మొగ్గు చూపలేదు. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలు థర్డ్ ఫ్రంట్​గా ఏర్పడినా మోడీకి దీటైన లీడరే లేరని ఈ సర్వేలో తేలింది.