వన్డే సిరీస్ భారత్ కైవసం!

స్వదేశంలో ఇంగ్లాండ్తో టెస్ట్ టి20 సిరీస్ గెలుచుకున్న భారత్ వన్డే సిరీస్ ను సైతం కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ 7 పరుగులతో గెలిచి వన్డే సిరీస్ను తన ఖాతాలో వేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ శిఖర్ ధావన్‌ (67; 56 బంతుల్లో 10×4), రిషబ్ పంత్ ‌ (78; 62 బంతుల్లో 5×4, 4×6), హార్దిక్ పాండ్యా (64; 44 బంతుల్లో 5×4, 4×6) అర్థ శతకాలతో చెలరేగారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్కుడు 3 రషీద్ రెండు వికెట్లతో రాణించారు. అనంతరం చేతనలో ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో మూడు వందల ఇరవై రెండు (322) పరుగులు చేసి అలౌటైంది. సామ్ ‌కరన్‌(95*; 83 బంతుల్లో 9×4, 3×6) ఆకట్టుకున్నాడు. భారత్ బౌలర్లలో, భువీ (3), శార్దూల్‌ (4) వికెట్లతో రాణించారు. చివరి బంతి వరకు సాగిన ఈ పోరులో విజయం భారత్ను వరించింది.