కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రహస్య భేటి ప్రాధాన్యం సంతరించుకుంది. భేటికి సంబంధించి ఎటువంటి విషయం బయటికి రాలేదు. కానీ హొంమంత్రి అమిత్ షా ఆదివారం ఓ మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో ప్రతి విషయం బయటికి చెప్పలేం కదా అని బదులివ్వడంతో రకరకాల ఊహగానాలు వినిపిస్తున్నాయి.
మహరాష్ట్ర హొంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ ముఖ్ పై ఆరోపణల నేపథ్యంలో ఈ భేటి జరిగినట్లు ప్రధానంగా తెలుస్తోంది. హెంమంత్రి రాజీనామాకు మహరాష్ట్రలో బీజేపీ పట్టుబట్టడం.. అధికార పార్టీ శివసేన నేత సంజయ్ రౌత్, అనిల్ దేశ్ ముఖ్ పై పరోక్ష ఆరోపణలు చేయండం చూస్తుంటే మహరాష్ట్రలో మరోసారి రాజకీయ సంక్షోబం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.