జెషోరేశ్వరి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు!

బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ శనివారం ఢాకాలోని జెషోరేశ్వరి కాళీ ఆలయన్ని సందర్శించారు. వెండితో తయారుచేసిన బంగారు పూత పూసిన మకుటాన్ని కాళీ మాత కు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నుంచి మానవాళిని కాపాడాలని కాళీమాతను ప్రార్థించినట్లు తెలిపారు. హిందూ మైథాలజీ ప్రకారం 51 శక్తి పీఠాల్లో జేషోరేశ్వరి కాళీ ఆలయం ఒకటని.. దీన్ని 16 వ శతాబ్దంలో నిర్మించారని అన్నారు. ప్రపంచంలో అశాంతి కి బదులుగా శాంతిిి ప్రేమ ను ఇండియా బంగ్లాదేశ్ కోరుకుంటున్నాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు.