Narendramodi: దేశంలో అత్యంత శక్తివంతమైన 100 మంది జాబితాను ” ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ ” గురువారం విడుదల చేసింది. ఈజాబితాలో ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచారు. రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన మోదీ.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాందించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభావశీలుర జాబితాలో సైతం అగ్రదేశాల అధినేతల కంటే మోదీ ముందున్నారు. రానున్న లొక్ సభ ఎన్నికల్లో ఆయన ముచ్చటగా మూడోసారి ప్రధాని అయ్యే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే ఆయా ప్రధాన మీడియా సంస్థలతో పాటు సర్వే సంస్థలు తేల్చేశాయి.
ఇక అత్యంత శక్తివంతుల జాబితాలో మోదీ తో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా, నిర్మలాసీతారామన్, జైశంకర్ , రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా ఉన్నారు. లిస్టులో ఆర్ఎస్ఎస్ చీఫ్ మూడో స్థానంలో.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నాలుగో స్థానంలో.. వ్యాపారవేత్త గౌతమ్ అదానీ టెన్త్ ప్లేస్ లో ఉన్నట్లు ” దిఇండియన్ ఎక్స్ ప్రెస్ ” ప్రకటించింది.