మరోసారి అభిమానుల మనస్సులను గెలుచుకున్న స్వర్ణపతక విజేత!

జావెలిన్ త్రో స్వర్ణపతక విజేత నీరజ్ చోప్రా మరోసారి వార్తల్లో నిలిచాడు.ఇటీవల జరిగిన స్టాక్ హోమ్ డైమండ్ లీగ్ లో పాల్గొన్న నీరజ్.. వ్యక్తిగతరికార్డు 89.94 మీటర్లను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.లీగ్ అనంతరం అతను బస్సుకోసం స్టేడియం బయట వెయిట్ చూస్తున్నప్పడు.. కొందరూ అభిమానులతో ముచ్చటించారు. ఈక్రమంలో అభిమానుల గుంపులో ఓవృద్ధుడిని గుర్తించిన.. నీరజ్ అతని పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్నాడు. ఈవీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఇక వీడియో గమనించినట్లయితే.. మ్యాచ్ అనంతరం అభిమానులతో కలిసి సెల్ఫీ దిగిన నీరజ్ వారితో కలిసి ముచ్చటించారు.అప్పుడే వృద్ధుడిని గమనించిన నీరజ్.. అతని పాదాలకు తాకి ఆశీస్సులు తీసుకున్నాడు. వెంటనే అతను .. నెక్ట్స్ మీరు 90 మీటర్ల మైలురాయిని అధిగమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపాడు.అనంతరం ఇద్దరూ పరస్పరం అభినందనలు చెప్పుకున్నారు . ఈవీడియో పట్ల స్పందించిన నెటిజన్.. అగ్లీబార్ 90 సే ఉప్పర్ జాయేగా(నెక్ట్స్ మీరు ఖచ్చితంగా 90 మీటర్లపైగా విసురుతారు) అంటూ కామెంట్ చేయగా.. మరో నెటిజన్ ‘మిస్టర్ చోప్రా కెరీర్ అద్భుతంగా ఉండాలని శుభాకాంక్షలు తెలుపగా.. నీరజ్ అతనికి ధన్యవాదాలు అంటూ మర్యదాపూర్వకంగా రిప్లై ఇచ్చాడు.