sambashiva Rao :
=============
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన వైవాహిక బంధాన్నితెంచుకునేందుకు సిద్దమైందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 12 ఏళ్ల క్రితం పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహమాడిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ ఇద్దరి మధ్య సఖ్యత లేదని, సంసారం సాఫీగా సాగడం లేదని ప్రచారం జరుగుతోంది. పాకిస్తాన్ కి చెందిన మోడల్‌తో షోయబ్ మాలిక్ పెట్టుకున్న వివాహేతర సంబంధం వీరి కాపురంలో నిప్పులు పోసాయని తెలుస్తోంది.
మోడల్ మోజులో పడిన షోయబ్ మాలిక్.. సానియాను పట్టించుకోవడం మానేసాడేట. కొన్నాళ్ల క్రితం షోయబ్ సదరు మోడల్‌తో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి సానియాను పట్టించుకోవడం మానేసాడేనే టాక్ నడుస్తుంది. సానియా ఎన్ని సార్లు చెప్పిన మాలిక్ ఆమె మాట పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. దీంతో విసిగి పోయిన సానియా విడాకులు తీసుకోవాలి నిర్ణయించుకుందని తెలుస్తుంది. తాజాగా సానియా మీర్జా చేసిన పోస్ట్‌లు, పరోక్ష వ్యాఖ్యలు ఈ ప్రచారానికి ఆజ్యం పోస్తున్నాయి.
సోషల్ మీడియా వేదికగా ‘కఠిన పరిస్థితుల నుంచి నన్ను బయటకు తీసుకొచ్చే క్షణాలు’ అంటూ ఆమె ఓ ఫోటోను షేర్ చేసింది దీంతో ఇద్దరి వైవాహిక జీవితానికి బీటలు వారినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే సానియా మీర్జా విడాకులు తీసుబోతున్నట్లు వస్తున్నా వార్తలు ఇంత వరకు ఎవరు ఖండించకపోవడం గమన్హారం.