భారత మహిళ క్రికెటర్లు ఐసీసీ ర్యాకింగ్స్ లో అదరగొట్టారు. తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాకింగ్స్లో టాప్20 లో నలుగురు క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో.. స్టార్ ప్లేయర్ స్మృతి మంథాన టాప్ టెన్ లో 4 వ స్థానాన్ని దక్కించుకుంది . మరో క్రికెటర్ జెమ్మి రోడ్రిగ్స్ 14 వస్థానంలో .. కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ 18 వ స్థానంలో నిలిచారు..శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు 664 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతోంది.
బౌలింగ్ విభాగంలో టీంఇండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రాధాయాదవ్ ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి పదమూడో స్థానానాకి చేరింది. శ్రీలంకతో సిరీస్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంతో యాదవ్ ర్యాంక్ మెరగయ్యింది. ఇక పూజావస్త్రాకర్ తన ర్యాంక్ ని మెరుగుపరుచుకుని 32గ వస్థానంలో కొనసాగుతోంది. ఇక ఆల్ రౌండర్ విభాగంలో కెప్టెన్ హార్మ న్ ప్రీత్ 23 వస్థానంలో.. పూజావస్త్రాకర్ 35 వస్థానంలో కొనసాగుతున్నారు.