ఐర్లాండ్ తో జరిగిన టీ 20 సీరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. డబ్లిన్ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో హార్దిక్ జట్టు 4 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత ఆటగాడు దీపక్ హుడా పొట్టి ఫార్మాట్ కెరీర్ లో తొలి సెంచరీ నమోదు చేశాడు.
అంతకుముందు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20ఓవర్లలో 225 పరుగుల భారీ స్కోరు సాధించింది. బ్యాటింగ్లో దీపక్ హుడా సెంచరీతో చెలరేగగా.. సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ మెరిశాడు. ఐర్లాండ్ బౌలర్లలో అడైర్ మూడు, లిటిల్, యంగ్ రే తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్య చేదనలో బరిలోకి దిగిన ఐర్లాండ్ 5 వికెట్ల కోల్పోయి 221 పరుగులు చేసింది. చివరి ఓవర్ వరకు ఇరుజట్ల మధ్య విజయం దోబూచులాడింది. ఆఖరి ఓవర్లో ఐర్లాండ్ గెలుపుకు 17 పరుగులు కావాల్సిన తరుణంలో.. భారత యువ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ తెలివిగా బౌలింగ్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఆ జట్టులో స్టిర్లింగ్, బాల్ బిర్నీ మెరుపు ఇన్నింగ్స్ ఆడగా. హ్యారీ టెక్టార్ (39) ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ తలా ఓ వికెట్ పడగొట్టారు.