జీవితపాఠాన్ని బోధించే వీడియో వైరల్..!!

ఇంటర్నెట్ లో కొన్ని వీడియోలు చూసినప్పడు.. అందులో కొన్ని జీవిత పాఠాలను బోధిస్తాయి. వాటిని చూసినప్పడు అందులోని భావాలు మనల్ని ఉత్తేజపరుస్తాయి.అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

courtesy: NDTV

ఇక వీడియో గమనించినట్లయితే.. ఓవ్యక్తి రెండు ఉక్కు బంతులను వదులుతాడు.ఒక సరళ మార్గంలో వెలుతుండగా.. మరోకటి ఎత్తుపల్లాలు కలిగిన దారిలో వెలుతోంది. కానీ ముందుదానికంటే అది త్వరగా వెనక్కితిరిగి వస్తుంది. జీవితం అంతే ఒడిదోడుకుల ప్రయాణంలో అపజయాలు ఎదురైనప్పడు.. గోడకు కొట్టిన బంతివలే తిరిగి వస్తారని ఆవీడియో సందేశంగా చెప్పవచ్చు. ఇప్పడు ఈవీడియోను 7 మిలియన్లకు పైగా వీక్షించారు. 36,000 మంది రీట్విట్ చేయగా.. 2,23,000 లైక్‌ చేశారు.

ఇక వీడియో పట్ల నెటిజన్స్ భిన్నంగా స్పందించారు. ఇది ఎవరూ చదువుతారని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. జీవితంలో ఎత్తుపల్లాలను సమానంగా స్వీకరించండి అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ మీరు బంతి మాదిరి మీవ్యక్తిత్వం ఉన్నట్లయితే నిజంగా విజయం సాధిస్తారంటూ క్యాప్షన్ జతచేశాడు.