ఐపీఎల్ 15 వ సీజన్ నూ కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఘనంగా ఆరంభించింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో ఆ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 132 పరుగులను 18.3 ఓవర్లలోనే ఛేదించి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు.. కోలకతా బౌలర్ల ధాటికి స్వల్ప స్కోర్ కు పరిమితమైంది. సగం ఓవర్లకే సగం వికెట్లు కోల్పోయిన ఆజట్టును.. ధోనీ(50) అర్ధ సెంచరీతో ఆదుకున్నాడు. కెప్టెన్ రవీంద్ర జడేజా(26), రాబిన్ ఉతప్ప (28) ఓ మోస్తారు పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు తీయగా, రసెల్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం 132 స్వల్ప పరుగులను చేధించే క్రమంలో కోల్కతా జట్టు 4 వికెట్లను మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ రహెనే(44) టాప్ స్క్రోరర్ గా నిలిచాడు. చెన్నై బౌలర్లలో బ్రావో మూడు వికెట్లు తీయగా.. శాంట్నర్ ఒక వికెట్ పడగొట్టాడు.