ఐపీఎల్2022లో బోణీ కొట్టిన రాజస్థాన్ రాయల్స్!

ఐపీఎల్​ 15 వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి మ్యాచ్లో బోణీ కొట్టింది. బుధవారం సన్​రైజర్స్​ హైదరాబాద్​ తో జరిగిన పోరులో రాజస్థాన్ జట్టు 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు.. నిర్ణీత 20ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. ఆ జట్టులో కెప్టెన్ సంజూ శాంసన్‌ (55) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడు దేవ్‌దత్‌ పడిక్కల్, జోస్‌ బట్లర్ , యశస్వీ జైస్వాల్ మోస్తారు పరుగులతో ఫర్వాలేదనిపించారు. హైదరాబాద్‌ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్, నటరాజన్‌ రెండేసి, భువనేశ్వర్‌ కుమార్, రొమెరియో షెఫర్డ్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం 211 పరుగులు భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్ రైజర్స్ జట్టు 149 పరుగులకే చేతులెత్తేసింది. హైదరాబాద్ జట్టులో మార్‌క్రమ్‌ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ (40 ) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ 3​, ప్రసిద్ధ కృష్ణ, బోల్ట్​ రెండేసి వికెట్లు పడగొట్టారు.