సుస్మితాసేన్ తో లలిత్ మోడీ డేటింగ్.. ట్విట్టర్లో వెల్లడి!

ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్ )సృష్టికర్త లలిత్ మోడీ బాలీవుడ్ నటి సుస్మితా సేన్ ఒక్కటి కాబోతున్నారు. ఈవిషయాన్ని లలిత్ మోడీ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఫ్యామిలితో మాల్దీవుల్లో ఎంజాయ్ చేశాకా లండన్ తిరిగివచ్చానని.. నాబెటర్ ఆఫ్ (సుస్మిత) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లలేదని..ఆమెతో జీవితం ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని.. చంద్రుడిపై తేలియాడుతున్నట్లు ఉందని లలిత్ ట్విట్ లో వెల్లడించాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇక కొద్దీ సేపటీకి మరో ట్విట్ చేసిన లలిత్ మోదీ వివాహ బంధం పై క్లారీటి ఇచ్చారు. ప్రస్తుతానికి ఇద్దరికి పెళ్లి కాలేదని.. కేవలం డేటింగ్ మాత్రమే చేస్తున్నట్లు స్పష్టత ఇచ్చారు. అతి త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతామంటూ ఆయన  ట్విట్ చేశారు.

 

ఐపీఎల్‌ చైర్మన్ గా వ్యవహరించిన లలిత్ మోడీ పై మనీలాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఈనేపథ్యంలోనే అతను 2010లో దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాడు . అప్పటినుంచి అతను లండన్‌లో ఉంటున్నాడు.2013లో అతనిపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపితమైంది. దీంతో క్రికెట్‌కు సంబంధించిన అన్ని కార్యకలాపాల్లో పాల్గొనకుండా BCCI అతనిపై జీవితకాల నిషేధం విధించింది.

కాగా సుస్మితా సేన్ 1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఆమె 1996లో వచ్చిన దస్తక్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె బీవీ నంబర్ 1, దో నాట్ డిస్టర్బ్, మై హూ నా, మైనే ప్యార్ క్యున్ కియా, తుమ్‌కో నా భూల్ పాయేంగే, నో ప్రాబ్లమ్ వంటి చిత్రాలలో నటించింది. ఇక ప్రేమ విషయానికోస్తే.. మొదట్లో పాక్‌ క్రికెటర్‌ వసీమ్‌ అక్రమ్‌తో ప్రేమ వ్యవహరం నడిపింది. వీరిద్దరూ కలిసి సహజీవనం చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ బంధం పెళ్లిపీటలెక్కకుండానే పెటాకులైంది. కొన్నాళ్ల తర్వాత ప్రముఖ మోడల్‌ రోహ్‌మన్‌తో ప్రేమలో పడింది. గతేడాది డిసెంబర్‌లో అతనితో విడిపోతున్నట్లు ప్రకటించింది. ఆమెకు ఇద్దరూ కుమార్తెలు అలీసా, రెనీ. 2000లో రెనీని.. 2010లో అలీసారని ఆమె దత్తత తీసుకున్నారు.