స్టార్ ఆటగాళ్లకు ఝలక్ :

ఐపీఎల్ సీజన్ 2021 వేలం కోసం ఫ్రాంచైజీలు సరికొత్తగా సిద్ధమవుతున్నాయి. టీంలకు నమ్మినబంటుగా ఉన్నటువంటి స్టార్ ఆటగాళ్లను వదిలించుకోని కుర్రాళ్ళుకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రాజస్థాన్ రాయల్స్ ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్, ముంబై శ్రీలంక పేసర్ లసిత్ మలింగాను వదిలించుకుంది. ఐపీఎల్ విజయవంతమైన జట్టుగా పేరుగాంచిన చెన్నై సూపర్ కింగ్స్ సైతం ఆరుగురు ఆటగాళ్లను వదిలేసుకుంది. అయితే ఊహించని విధంగా స్టార్ ఆటగాడు సురేష్ రైనాను రిటైన్ చేసుకుంది.
ఫ్రాంచైజీలు రిలీజ్డ్ చేసిన ప్లేయర్ల వివరాలు..
చెన్నై సూపర్ కింగ్స్ :
హర్భజన్, పీయూష్ చావ్లా , కేదార్ జాదవ్, మురళీ విజయ్, మోను సింగ్, షైన్ వాట్సన్.
ముంబై ఇండియన్స్ :
లసిత్ మలింగ, కల్టర్ నైల్ , పాటిన్సన్ , మెక్లిగన్, ప్రిన్స్ బల్వంత్ రాయ్, దిగ్విజయ్ దేష్ ముక్.
ఢిల్లీ క్యాపిటల్స్:
మోహిత్ శర్మ, కిమో పాల్, అలెక్స్ క్యారీ, జేసన్ రాయ్, తుషార్ దేశ్పాండే.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు :
మోయిన్ అలీ, శివమ్ దుబే, గురుకిరత్ సింగ్, పించ్, క్రిస్ మోరిస్, పవన్ నేగి, పార్థివ్ పటేల్, స్టెయిన్, ఉడాన, ఉమేష్ యాదవ్.
కోల్కతా నైట్ రైడర్స్ :
టామ్ బాంటమ్, క్రిస్ గ్రీన్, సిద్దేష్ లాడ్, నిఖిల్ నాయక్, సిద్దార్థ్, హరీ గుర్ని.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ :
మాక్స్వెల్, కరణ్ నాయర్, విలోటన్, జగదీష్ సుచిత్, ముజిబర్ రెహ్మాన్, కాట్రెల్, నిషమ్, గౌతమ్, తజిందర్ సింగ్.
రాజస్థాన్ రాయల్స్:
స్టీవ్ స్మిత్, అంకిత్ రాజ్పుత్, థామస్, అక్ష్ సింగ్, వరుణ్ ఆరోన్, టామ్ కరణ్, అనిరుధ్ జోషి, శశాంక్ సింగ్.
సన్రైజర్స్ హైదరాబాద్ :
బిల్లీ స్టాన్లెక్ , ఫాబియన్ అలెన్, సంజయ్ యాదవ్, బావనక సందీప్, ఎర్రా పృధ్వీరాజ్.

Optimized by Optimole