ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో రెండు కొత్త జట్లు వచ్చి చేరాయి. కొత్తగా లక్నో, ఆహ్మదాబాద్ ఫ్రాంచైజీలను బిసిసిఐ ప్రకటించింది. దీంతో ఐపీఎల్ లో జట్ల సంఖ్య పదికి చేరింది. లక్నో ఫ్రాంచైజీని సంజీవ్ గోయెంకా గ్రూప్ 7090 కోట్లకు దక్కించుకోగా… ఆహ్మదాబాద్ ఫ్రాంచైజీని సివిసి కంపెనీ 5600 కోట్లకు కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ లో పది జట్లు ఆడతాయని బిసిసిఐ తెలిపింది. ఆటగాళ్ల మెగా వేలం డిసెంబర్ లో నిర్వహించనున్నట్లు పేర్కొంది.