కేసీఆర్ మరోసారి దళితులను మోసం చేస్తున్నారు: సంజయ్

హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధుల కేటాయింపు వివరాలను ప్రజలకు తెలుపుతూ, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, వైఫల్యాలు, మోసాలు, కుటుంబ, అవినీతి పాలన గురించి ప్రజలకు వివరించారు.

కేసీఆర్ కు హుజూరాబాద్ లో ముఖం చెల్లక ఈసీపై నిందలు వేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. భారత జాతీయ ఎన్నికల సంఘానికి ప్రపంచంలోనే మంచి గుర్తింపు ఉందన్నారు. సీఎంగా ఉంటూ ఈసీపై నిందలేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు.
దళితబంధు పేరిట కేసీఆర్ మరోసారి దళితులను మోసం చేస్తున్నాడని సంజయ్ ఆరోపించారు. నాడు ఉద్యమాల కోసం బలిదానం చేసుకుంటే….నేడు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొందన్నారు. పేదల ఇండ్ల కోసం కేంద్రం 3 లక్షల ఇండ్లు మంజూరు చేసి రూ.10 వేల కోట్లు కేటాయిస్తే…ఒక్క ఇల్లు కట్టకుండా ఓట్లను కొనుగోలు చేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని సంజయ్ ధ్వజమెత్తారు.