Helath: నార్మల్ డెలివరీ మంచిదా.‌. సిజేరియన్ మంచిదా?

సాయి వంశీ ( విశీ) : 

సాధారణంగా జరిగే ప్రసవాన్ని ఏ డాక్టర్ కూడా కాంప్లికేట్ చేసి సిజేరియన్ చేయాలని అనుకోరు. అలా అన్నారు అంటే, అక్కడ నిజంగానే ఏదో సమస్య ఉంది అని అర్థం. అన్ని సమస్యలూ చూసేవాళ్లకూ, ఒక్కోసారి తల్లికి కూడా అర్థం కావు. ప్రసవం అని మనం చాలా సహజంగా అంటున్నాం కానీ, ఒక స్త్రీకి తొలి కాన్పు నార్మల్ కావాలంటే మూడు నుంచి నాలుగు గంటలసేపు పడుతుంది. అంతంతసేపు ఎదురుచూడాలంటే కడుపు లోపలి బిడ్డ, బయట తల్లి చాలా ఇబ్బంది పడతారు. పైగా లోపలి బిడ్డకు సరిగ్గా ఆక్సిజన్ అందకపోతే ప్రాణం పోతుంది. కాబట్టి ఒక బిడ్డకు ఎంత టైం ఇవ్వాలో అంత ఇచ్చేసి, ఆ తర్వాత ఇక కుదరదు అనుకుంటే సిజేరియన్ చేస్తాం. మాకు అంతా బాగానే ఉంది, కాబట్టి నార్మల్ డెలివరీయే చేయాలని పట్టుబడితే బిడ్డ ప్రాణాలకు ప్రమాదం జరుగుతుంది.

‘మా కూతురికి అరగంటలో డెలివరీ అయిపోయింది, నా కోడలికి మాత్రం మూడు గంటలు పట్టింది. లోపల డాక్టర్లు ఏదో మతలబు చేశారు’ అని కొందరు అనుమానపడుతూ ఉంటారు. మనందరి ముఖాలు తేడాగా ఉన్నట్టే, స్త్రీల గర్భసంచిలోనూ తేడాలు ఉంటాయి. తల్లి ఆరోగ్యం, ఒంట్లో రక్తం, కడుపులో బిడ్డ బరువు, లోపల బిడ్డ పొజిషన్, ఆ బిడ్డ చుట్టూ ఉమ్మనీరు, బిడ్డకు ఊపిరి అందే స్థితి.. ఇవన్నింటినీ బట్టి ప్రసవం టైంలో తేడా ఉంటుంది. ఆ తేడా గురించి తెలియక చాలామంది ఏదేదో ఊహించుకుని అనుమానపడుతూ ఉంటారు.

‘ప్రసవ వేదన’ అనేది చాలా పెద్ద పదం. దాన్ని చాలామంది ఇష్టం వచ్చినట్లు వాడుతుంటారు. అలా వాడటం వల్ల జరిగిన నష్టం ఏమిటంటే, ఆడపిల్లలు ప్రసవం అంటే భరించలేని నొప్పి అని భయపడుతున్నారు. కొందరు అమ్మాయిలు తాము తల్లి అవుతున్నాం అని తెలియగానే ‘మాకు నొప్పి వద్దు. నార్మల్ డెలివరీ వద్దు. సిజేరియన్ చేయండి’ అని అడుగుతున్నారు. అలా ఏమీ కాదని ధైర్యం చెప్పాలని చూస్తే వాళ్లు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. చదువుకున్న అమ్మాయిలే అందులో ఎక్కువగా ఉన్నారు. వాళ్లు అలా అడిగితే డాక్టర్లు మాత్రం ఏం చేస్తారు?

చాలామంది పిల్లలకు తమ పాలు ఇవ్వకుండా ప్యాకెట్ పాలు అలవాటు చేస్తుంటారు‌. మనం ఇవాళ తాగే ప్యాకెట్‌లోని పాలు వారం క్రితం గేదె నుంచి తీసినవి అని మర్చిపోవద్దు. ఎక్కడెక్కడో, ఎలాంటి పరిస్థితుల మధ్యో తయారైన పాలను ఒకచోట చేర్చి, వాటిలో కొవ్వులు తీసేసి ప్యాకెట్లో పోసి మనకు పంపిస్తారు. ఆ గేదెలకు తప్పకుండా ఇంజెక్షన్లు ఇచ్చే ఉంటారు. ఆ పాలు పిల్లలకు పడితే వాళ్లు ఏం కాను? ఆ పాలు వాళ్లకు అలవాటు చేయడం వల్లే వాళ్లలో చిన్నవయసులోనే హార్మోన్లు దెబ్బతింటున్నాయి. జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతోంది.

ఇంకోటి, చాలామంది థైరాయిడ్ సమస్య అని చెప్తుంటారు. దీన్నిబట్టి థైరాయిడ్ మన శరీరంలో ఉంటే సమస్య అని చాలామంది తప్పుగా అనుకుంటారు. మనం గొంతులో ఉండే ఒక భాగం పేరే థైరాయిడ్. అది ‘Thyroxine, Triiodothyronine’ అనే రెండు ప్రధాన హార్మోన్లను తయారు చేస్తుంది. అవి మన శరీరంలో ప్రతి కణం మీద ప్రభావం చూపుతాయి. వాటిలో అసమానతలు ఏర్పడితే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉప్పు ఎక్కువ తింటే థైరాయిడ్ సమస్య వస్తుంది. అందునా మనం వాడే అయోడైజ్డ్ ఉప్పు మరింత ప్రమాదకరం. ఎందుకంటే మన శరీరానికి కావల్సిన అయోడిన్ థైరాయిడే తయారు చేసి ఇస్తుంది. ఎప్పుడైతే మనం కార్పొరేట్ సంస్థల మాట విని అయోడిన్ ఉప్పు వాడటం మొదలుపెడతామో, ఇంక థైరాయిడ్ అలుగుతుంది. మీరే అయోడిన్ తీసుకుంటే నేనెందుకు అని పని చేయడం మానేస్తుంది‌. దీంతో సమస్యలు మొదలవుతాయి. అందుకే కల్లుప్పు వాడమని మేం అందరికీ చెప్తూ ఉంటాం.

(చెన్నైలోని ప్రముఖ డాక్టర్ విజయలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు..)