Janasenavsysrcp: ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేల్చుతున్నాయి.ఈ నేపథ్యంలోనే జనసేన రూపొందించిన సెటైరికల్ కార్టూన్ నెట్టింట్లో హాల్ చల్ చేస్తోంది. ఈయనే మన జగనన్నకు చెబుదాం ఆపరేటర్.. కార్యక్రమానికి పిచ్చపాటిగా రెస్పాన్స్ వచ్చిందట క్యాప్షన్తో రూపొందించిన కార్టూన్ పై జనసైనికులు తమదైన శైలిలో కామెంట్లతో రెచ్చిపోతున్నారు. అటు టీడీపీ నేతలు సైతం దొరికిందే చాన్సుగా నిత్యావసరా ధరలు పెంపు, చెత్తపన్ను, ఇసుక దందా, జాబ్ క్యాలెండర్ వంటి అంశాలను ప్రస్తావిస్తూ నిజంగానే జగనన్నకు చెబుదాం అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరైతే ఏపీ రాజధాని పై జగనన్నకు చెబుదాం.. వెంటనే మన రాష్ట్ర ప్రజల కోరిక నెరవేరుతుందంటూ ఎద్దేవ చేస్తూ కామెంట్లు జోడిస్తున్నారు.
అటు టీడీపీ నేతల సంగతి సరేసరి.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఏకంగా జగనన్న చెబుదాం కౌంటర్ గా ప్రజలగోడు చెబుతున్నాం వినండి.. మా సమస్యలను పరిష్కరించండి స్లోగన్ తో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో గిరిధర్ రెడ్డి దారిలో మరికొందరు నేతలు సైతం వినూత్న కార్యక్రమాలు చేపట్టి జగన్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.