KAmoviereview: ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా జయాపజయాలతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో రాణిస్తున్న నటుడు కిరణ్ అబ్బవరం. ఇప్పటివరకూ చేసింది తక్కువ సినిమాలే అయినా తన అభిరుచికి తగ్గ కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. దీపావళి సందర్భంగా కిరణ్ నటించిన పాన్ ఇండియా మూవీ క థియేటర్లోకి వచ్చింది. మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..!
కథ:
సినిమా కథ అంతా 1977లో జరుగుతుంది. అభినయ వాసుదేవ్ ఓ అనాధ. కృష్ణగిరి ఊరి ప్రజలే తనవాళ్లుగా భావిస్తూ జీవిస్తుంటాడు. చిన్నప్పటి నుంచి ఉత్తరాలు చదివే అలవాటుతో పోస్ట్ మాస్టర్ రామారావు( అచ్యుత్ కుమార్) దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుతాడు. మాస్టర్ కూతురు సత్యభామతో( నయని సారిక) ప్రేమలో పడతాడు. అనుకోకుండా అతనిని ఓ ముఠా చీకటి గదిలో బంధిస్తుంది. కృష్ణగిరి గ్రామంలో తెల్లవారుజామున అమ్మాయిలు ఒక్కొక్కరుగా మిస్ అవుతుంటారు. అసలు అమ్మాయిలు మిస్ అవడానికి కారణం ఎవరు? చీకటి గదిలో బంధించబడిన రాధ(తన్వి రామ్) కి వాసుకి సంబంధం ఏంటి? ఉత్తరాలు చదివే అలవాటున్న వాసుదేవ్ కి తెలిసిన నిజం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!
ఎలా ఉందంటే..?
క మూవీ కథ పాతదే అయినా మనిషి పుట్టుక.. కర్మఫలం.. రుణానుబంధం ఈ మూడు అంశాల ఆధారంగా దర్శకులు సుజీత్ -సందీప్ ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్లు సినిమాలో ట్విస్టులు ఊహించని విధంగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ పరంగా సినిమా పరవాలేదు. సెకండాఫ్ బాగుంది. ట్విస్టులను రివీల్ చేసే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ సోసోగా అనిపిస్తుంది. సినిమా చివరి 20 నిమిషాలు అదిరిపోయింది. క్లైమాక్స్ సరి కొత్తగా ఉంది. జాతరలో మాస్ సాంగ్ థియేటర్లో పూనకాలు తెప్పిస్తుంది.
ఎవరెలా చేశారంటే..?
ఇటీవల చేసిన సినిమాలు ఆశించిన మేరకు విజయం సాధించక పోవడంతో కిరణ్ క మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించాడు. నటన పరంగా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. యాక్షన్ ఎమోషన్ సీన్స్ పరంగా తనలోని మరో కోణం పరిచయం చేశాడు. హిరోయిన్ నయని సారిక తనదైన నటనతో మెప్పించింది. ప్రాధాన్యమున్న పాత్రలో తన్వి రామ్ ఆకట్టుకుంది. మిగతా నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు
సాంకేతికంగా పరంగా దర్శకులు సుజీత్ – సందీప్ లు తాము అనుకున్న కథను ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అక్కడక్కడ కొంత మైనస్ ఉన్నా తమ ప్రతిభతో నెట్టుకొచ్చారు.సామ్ సీఎస్ నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్. ఎడిటింగ్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ అద్భుతం. నిర్మాణం విలువలు బాగున్నాయి.
“ఒక్క మాటలో చెప్పాలంటే కేక పెట్టించే క ”’..
రివ్యూ రేటింగ్: 3/5 ( సమీక్ష ప్రేక్షకుడి దృష్టి కోణంలో ఇవ్వబడింది)