శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ రేర్ ఫీట్ సాధించాడు. భారత్ తరపున టెస్టు ఫార్మాట్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా కపిల్ దేవ్ పేరిట ఉన్న 40 ఏళ్ల రికార్డును పంత్ బద్దలు కొట్టాడు. దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా.. పంత్ మాత్రం కేవలం 28 బంతుల్లోనే పూర్తి చేసి ఈ ఘనత సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్సులు ఉండటం విశేషం. అంతేకాక ప్రతి టెస్ట్‌లో 150+ స్ట్రైక్ రేట్‌తో 30+ పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా పంత్ మరో రికార్డు నెలకొల్పాడు.