వెస్టిండీస్ జట్టుపై భారత మహిళల జట్టు ఘన విజయం..

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్​లో భారత జట్టు అదరగొట్టింది. శనివారం వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్లో155 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 318 పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టు 40.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో స్నేహ్​ రానా 3, మేఘనా సింగ్​ 2, రాజేశ్వరి గైక్వాడ్​, పూజా వస్త్రాకర్​, జులన్​ గోస్వామి తలో వికెట్​ తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఇక అంతకుముందు టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న భారత్​ జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి 317 పరుగులు సాధించింది. ఓపెనర్ స్మృతి మంధాన(123)..హర్మన్​ ప్రీత్​ కౌర్​(109) శతకాలతో చెలరేగి ఆడారు. విండీస్​​ బౌలర్లలో అనిస మహమ్మద్​ 2 వికెట్లు తీయగా.. షమిలియా, షకేరా, హేలే, దయేంద్ర, యాలియా చెరో వికెట్ పడగొట్టారు.