ప్రభాస్ – పూజా హెగ్డే నటించిన పాన్ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్’. పీరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య సినిమాకు మిక్సిడ్ టాక్ వచ్చినప్పటికి.. కలెక్షన్ల పరంగా తొలిరోజు బాక్స్ ఆఫీసు వద్ద దుమ్ములేపింది. దేశ వ్యాప్తంగా రూ.48 కోట్లు..రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.30 కోట్లకు పైగా రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. నైజాంలో రికార్డు స్థాయిలో రూ.15.50 కోట్లు కలెక్ట్ చేసినట్లు.. ఓవర్సీస్ లో 1.4 మిలియన్ల డాలర్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా విడుదలకు వారం ముందుగానే టికెట్స్ అమ్ముడయ్యాయి. సినిమాపై అంచనాలు భారీగా ఉండటంతో ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్లు రాబట్టింది.
ప్రేమకీ, విధికీ మధ్య సంఘర్షణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో.. రెబల్ స్టార్ కృష్ణంరాజు, అలనాటి బాలీవుడ్ నటి కీలక పాత్రలో నటించారు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యు.వి.క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. రాధా కృష్ణ దర్శకత్వం వహించారు.జస్టిన్ ప్రభాకరన్ పాటలు స్వరపరచగా, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.