పార్థ సారథి పోట్లూరి: పత్రికలు ‘సెల్ఫ్ స్టైల్డ్ ‘[Self Styled ] సిక్కు మత ఉద్ధారకుడు అనే తోక అమృత్ పాల్ సింగ్ కి తగిలించినా అసలు నిజం ఒక సామాన్య ట్రక్కు డ్రైవర్ కి పాకిస్థాన్ ISI శిక్షణ ఇచ్చి మరీ దుబాయి నుండి భారత్ కి తెచ్చి మారణకాండ జరిపించాలని చూసింది అని చెప్పవు. తనకి కేంద్ర ప్రభుత్వం తో బేరాలు ఆడడానికి పనికి వస్తాడని కేజ్రీ కూడా ఒక చేయి వేశాడు ! కానీ ఢిల్లీ లిక్కర్ గేట్ ఉచ్చు తన మెడకి కూడా చుట్టుకోబోతున్నదని గ్రహించిన క్రేజీ తాను ఏరి కోరీ మరీ ఒక తిక్కలోడిని పంజాబ్ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోపెట్టి ఒక ఆట ఆడాలని చూశాడు కానీ అమిత్ షా పంజాబ్ లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు ఉన్నాయని చివరి నిముషంలో అమృత్ పాల్ ని అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చాడు భగవత్ సింగ్ మాన్ కి !
అధికారం చేతిలో ఉంటే అమృత్ పాల్ సింగ్ లాంటి ట్రక్కు డ్రైవర్ ని అమాంతంగా ఒక వేర్పాటు వాద నాయకుడిగా ఎలా ప్రోజెక్ట్ చేయవచ్చో కేజ్రీవాల్ చేసి చూపించాడు !
గత ఫిబ్రవరి నెల 24 న అమృత్ పాల్ సింగ్ తన అనుచరుడు అయిన లవ్ ప్రీత్ సింగ్ ని కిడ్నాప్,బెదిరింపులు,హత్యా నేరం పైన పోలీసులు అరెస్ట్ చేసినందుకు అమృతసర్ సిటీ శివారు లో ఉన్న ‘అజ్ఞాల’[Ajnala ] పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి తన అనుచరుడిని విడిపించుకు పోయిన సంగతి తెలిసిందే ! అయితే లవ్ప్రీత్ సింగ్ మీద చేసిన FIR ని చించేసి ఆ స్టేషన్ లో ఉన్న పోలీసులని కత్తులు,తుపాకులు చూపించి బెదిరించి మరీ వెళ్లిపోయారు ! లవ్ ప్రీత్ సింగ్ మీద FIR మళ్ళీ ఫైల్ చేశారో లేదో తెలియదు ! అమృత్ పాల్ సింగ్ అతని అనుచరులు పోలీస్ స్టేషన్ మీద చేసిన దాడి మీద FIR ఫైల్ చేశారో లేదో తెలియదు !
దీని మీద అప్పట్లో కేంద్ర హోమ్ శాఖ సీరియస్ గా స్పందించినా G-20 దేశాల సమావేశాల సమయంలో చర్య తీసుకుంటే అది నిరసనల పేరుతో రోడ్డు మీద కి ఎక్కితే ప్రపంచ మీడియా దృష్టిలో పడుతుంది అని వేచి చూశారు అమిత్ షా గారు ! అసలు క్రేజీ వాల్ వ్యూహం కూడా ఇదే ! G-20 దేశాల సమావేశ సమయంలో అమృత్ పాల్ సింగ్ ని అరెస్ట్ చేయించి తద్వారా పంజాబ్ లో హింస ని ప్రజ్వరిల్ల చేసి G-20 దేశాధినేతల దృష్టిలో పడేట్లు చేయాలి అని ! కానీ ఇంటెలిజెన్స్ సమాచారం ఉండడం తో అప్పట్లో అమిత్ షా గారు తొందరపడలేదు ! ముందు మనీష్ సిసోడియా ని అరెస్ట్ చేసి మరీ కేజ్రీవాల్ కి పరోక్షంగా హెచ్చరిక పంపారు! ఇలాంటి ప్లాన్స్ కి భయపడము అని ! మనీష్ సిసోడియా అరెస్ట్ అవడం ని ఆపడం మరియు పంజాబ్ తో సహా భారత్ లో అశాంతి నెలకొని ఉన్నది అంటూ G-20 దేశాధి నేతల ముందు సీన్ క్రియేట్ చేద్దామనే ప్లాన్ కేజ్రీవాల్ ది ! మరో వైపు భారత్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అంటూ లండన్ వెళ్ళి మరీ రాహుల్ భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం యాదృచ్ఛికం అయితే కాదు !
G-20 దేశాల సమావేశాలు ముగిశాక అమిత్ షా గారినుండి పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ సింగ్ మాన్ కి పిలుపు వచ్చింది. భగవత్ సింగ్ మాన్ ఢిల్లీ వచ్చి అమిత్ షా గారితో సమావేశం అయ్యాడు. పంజాబ్ లో శాంతి భద్రతలు మీ పరిధిలోవే అయినా మీరు మీ కర్తవ్యం ని నిర్వర్తించడం లో విఫలం అయ్యారు కాబట్టి పంజాబ్ లో రాష్ట్రపతి పాలన పెట్టి కేంద్రం స్వయంగా నెరస్తులని అరెస్ట్ చేస్తుంది లేదా మీరే యాక్షన్ తీసుకొని సమస్యని అదుపులో తెస్తారా ? అంటూ సూటిగా చెప్పేశారు అమిత్ షా !
కేంద్రంలో బిజేపి అధికారంలో వచ్చిన తరువాత ఏ రాష్ట్రంలోనూ రాష్ట్ర పతి పాలన విధించలేదు ! గతం లో రాష్ట్రపతి పాలన ఏ ఏ సందర్భాలలో విధించాలో సుప్రీం కోర్టు విధి విధానాలని నిర్దేశించింది. వాటిలో రాష్ట్ర ప్రభుత్వం కనుక శాంతి భద్రత లని అదుపు చేయలేని స్థితి లో ఉండి చేతులు ఎత్తేసే సందర్భంలో మాత్రమే రాష్ట్రపతి పాలన విధించవచ్చు ! So! అమృత్ పాల్ సింగ్ విషయంలో FIR నమోదు చేయలేదు పంజాబ్ ప్రభుత్వం ఇది చాలు ఒక వేళ రాష్ట్రపతి పాలన విధిస్తే కేజ్రీ వాల్ సుప్రీం కోర్టుకి వెళ్ళినా సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి సుప్రీం కోర్ట్ రాష్ట్రపతి పాలన విధించడాన్ని సమర్ధిస్తుంది !
&**********************
పంజాబ్ తమ చేతిలో నుండి చేజారి పోయే అవకాశాలు ఉన్నాయని గ్రహించిన కేజ్రీవాల్ భగవత్ సింగ్ మాన్ చేత అమృత్ పాల్ సింగ్ ని అరెస్ట్ చేయించి ప్రస్తుతానికి సమయం తీసుకోవచ్చు అని భావించి అమృత్ పాల్ సింగ్ ని అరెస్ట్ చేయమని చెప్పాడు భగవత్ సింగ్ మాన్ కి. విషయం అమిత్ షా గారికి తెలిసి పంజాబ్ పోలీసుల తో పాటు కేంద్ర బలగాలతో కలిసి సంయుక్త ఆపరేషన్ చేయాలని ఆదేశించారు అమిత్ షా గారు ! ఇష్టం లేకున్నా ఒప్పుకున్నాడు కేజ్రీవాల్ ! పంజాబ్ లో నిర్ణయాలు తీసుకునేది కేజ్రీ మాత్రమే ! వాటిని అమలు చేసేది భగవత్ సింగ్ మాన్ !
కేజ్రీ వాల్ కి కనుక మొత్తం బాధ్యత ఇస్తే ఏదో ఒకటి చేసి అమృత్ పాల్ సింగ్ ని పంజాబ్ సరిహద్దులు దాటించి పాకిస్థాన్ పంపేసి అక్కడి నుండి కెనడా కానీ లండన్ కానీ పంపేసే అవకాశం ఉంటుంది అని భావించి కేంద్ర బలగాలని పంపించారు అమిత్ షా గారు !
1. మొత్తం 18 కంపనీ ల కేంద్ర బలగాలని శనివారం రోజున పంజాబ్ కి తరలించారు.
2. 9 కంపనీల CRPF బలగాలు మరియు 9 కంపనీల రాపిడ్ యాక్షన్ ఫోర్స్ [RAF] లని పంజాబ్ కి పంపించారు.
3. మొత్తం 19,000 మంది కేంద్ర బలగాలని పంజాబ్ పంపించారు అమిత్ షా గారు !
4. పంజాబ్ రాష్ట్రం మొత్తం మొబైల్,ఇంటర్నెట్ సర్వీసులని శనివారం నుండి ఆదివారం మధ్యాహ్నం వరకు నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు అమిత్ షా గారు ! ఖచ్చితంగా అమలు అయ్యింది. మొబైల్,ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయాయి !
5. అమృత్ పాల్ సింగ్ ని అరెస్ట్ చేస్తే ఎక్కడ ఎక్కడ ఆందోళనలు,అల్లర్లు జరిగే అవకాశం ఉందో అక్కడ కేంద్ర బలగాలని మోహరించారు! పంజాబ్ పోలీసులు కేవలం అమృత్ పాల్ సింగ్ ని అరెస్ట్ చేయడానికి మాత్రమే ఉపయోగించారు.
6. పోలీసులు కేంద్ర బలగాల సహాయంతో తనని వెంటాడుతున్నారని తెలుసుకున్న అమృత్ పాల్ సింగ్ అతని 10 మంది అనుచరులు ముక్తార్ సాహిబ్ వైపు పారిపోతున్నారు. పోలీసులు దాదాపుగా రోడ్లు అన్ని వైపుల నుండి బ్లాక్ చేశారు అప్పటికే ! ముక్తార్ సాహిబ్ రోడ్లు కూడా బ్లాక్ చేశారు. అదే రోడ్డులో అమృత్పాల్ సింగ్ అతని అనుచరులు వెళుతున్నరెండు వాహనాలని పోలీసులు అడ్డగించారు కానీ వాహనం నుండి దిగి వేరే వాహనంలోకి ఎక్కి అమృత్ పాల్ పారిపోయాడు కానీ అతని అనుచరులు అందరూ పట్టుబడ్డారు !
7. చివరకి పంజాబ్ నుండి హర్యానా లోకి పారిపోతున్న అమృత్ సింగ్ పాల్ ని గురుగ్రామ్ లో పట్టుకున్నారు పంజాబ్ పోలీసులు! గురుగ్రామ్ లోకి కనుక అమృత్ పాల్ వెళ్ళి ఉంటే అక్కడ సెర్చ్ ఆపరేషన్ చేయడం పంజాబ్ పోలీసుల వల్ల అయ్యేది కాదు. ఖచ్చితంగా గురుగ్రామ్ లో దాక్కొని అక్కడ నుండి విదేశాలకి పారిపోయేవాడు. జస్ట్ ఖాట్మండు వెళితే చాలు అక్కడి నుండి పాకిస్థాన్ అటు నుండి కెనడా కానీ లండన్ కానీ పారిపోయేవాడు !
8. 19 వేల కేంద్ర బలగాలు మరియు పంజాబ్ పోలీసులు కలిసి ఎక్కడికి అక్కడ దారులు మూసేసి,మొబైల్,ఇంటర్నెట్ సేవలని నిలిపివేసినా పంజాబ్ దాటి గురుగ్రామ్ వరకు వాహనాలు మారుస్తూ ఎలా తప్పించుకోగలిగాడు అమృత్ పాల్ సింగ్ ?
9. అంటే పంజాబ్ పోలీసుల నుండో లేక ఆమ్ ఆద్మీ పార్టీ నుండో ముందే ఆపరేషన్ విషయం అమృత్ పాల్ సింగ్ కి తెలిసిపోయింది. అమృత్ పాల్ సింగ్ కి సహకరిస్తున్నవారు కూడా ముందుగా ఎస్కేప్ ప్లాన్ సిద్ధం చేసుకొని ఉన్నారు.
10. గురుగ్రామ్ ని ఎంపిక చేసుకోవడం ముందస్తు వ్యూహంలో భాగమే ! గురుగ్రామ్ అనేది ఇంకో ప్రపంచం ! కార్దన్ సెర్చ్ చేయడం అంత సులువు కాదు గురుగ్రామ్ లో. చాలా తేలికగా గురుగ్రామ్ నుండి ఉత్తర ప్రదేశ్ లోకి అటు నుండి నేపాల్ కి పారిపోవడం సుళువు ! నేపాల్ నుండి పాకిస్థాన్ కి వెళ్ళడం ఇంకా సుళువు !
వారీ పంజాబ్ దే అనేది విదేశాల నుండి పుట్టిన వేర్పాటు వాదం ! కెనడా,లండన్ ల నుండి వ్యూహాలు,నిధులు అందుతున్నాయి! ఇక అమృత్ పాల్ ని NSA కి అప్ప చెపితేనె కానీ వాస్తవాలు బయటికి రావు ! కేసు NSA కి బదిలీ అవుతుంది అని తెలిసిన మరుక్షణం అమృత్పాల్ సింగ్ ని పంజాబ్ లోనె హత్య చేస్తారు ! కాబట్టి సినిమా ఇంకా ఉంది !
జైహింద్ ! జై భారత్ !