తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నికపై క్లారీటీ ఇచ్చారు మాజీఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఉప ఎన్నిక సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో వచ్చే అవకాశం ఉందని స్పష్టతనిచ్చారు.శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనపై వ్యాఖ్యలు చేసేముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. కండువాలు మార్చినంతా ఈజీగా పార్టీలు మార్చే వ్యక్తిని కాదంటూ ఫైర్ అయ్యారు. రాజగోపాల్ వ్యాఖ్యలతో ఉమ్మడి నల్లగొండ రాజకీయం ఒక్కసారిగా వేడేక్కింది.
ఇక మూడోవిడత ప్రజాసంగ్రామయాత్ర లో భాగంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నూ మర్యాద పూర్వకంగా కలిశారు రాజగోపాల్ రెడ్డి.మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పాదయాత్ర రూట్ మ్యాప్ లో మార్పులు చేయాలని సంజయ్ ని కోరినట్లు రాజగోపాల్ వెల్లడించారు. ఈనెల 21వ తేదీన చౌటుప్పల్ లో జరిగే భారీ బహిరంగ సభలో బీజేపీలో చేరుతున్నట్లు .. అందుకునుగుణంగా భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించినట్లు
తెలిపారు.
కాగా తనపై శాసనమండలి చైర్మన్ గుత్తా ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని కుండబద్దలు కొట్టారు రాజగోపాల్. తాను పదవులు, డబ్బు కోసం పార్టీ మారే వ్యక్తిని కాదంటూ మరోమారు స్పష్టం చేశారు. కండువాలు మార్చినంత ఈజీగా పార్టే మార్చే చరిత్ర తనది కాదని.. అలాంటి వారు విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.