బాలీవుడ్ హీరోలపై శృంగార తార హాట్ కామెంట్స్…

బాలీవుడ్ సెక్సీబాంబ్ మల్లికాశెరావత్ బాంబ్ పేల్చింది. హీరోలతో రాజీపడకపోవడం వల్ల అనేక సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందని మల్లికా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో సంచలనంగా మారాయి. తను సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినట్లు.. కెరీర్ తొలినాళ్లలో చాలా వివక్షను ఎదుర్కొనట్లు తెలిపింది. తాజాగా ఓ జాతీయ ఇంటర్వ్యూలో మాట్లాడిన మల్లికా ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

సంప్రదాయం కుటుంబం..

హరియాణాలోని సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినట్లు .. తల్లిదండ్రులకు సినిమా అంటే పడదని.. సినిమాల్లోకి వెళతానన్న తన నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకించారని చెప్పుకొచ్చింది.వెస్ట్రన్ దుస్తులు ధరించడం, స్నేహితులతో కలిసి రాత్రి బయటికి వెళ్లడం వంటి విషయాలు తమ వారికి ఇష్టముండేది కాదన్నారు.సినీ నటి కావాలని ఏ ఆడపిల్ల కోరుకోదు అని తండ్రి అభిప్రాయంగా ఉండేదని గుర్తు చేసుకున్నారు.తన కుటుంబ సభ్యులు ఏనాడూ తనకు అండగా నిలవలేదని.. తాను మాత్రం నమ్మినదానికోసం ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు మల్లికా స్పష్టం చేశారు.

నిలదొక్కుకోవాలనే పట్టుదల..

ఇక సినిమా విషయంలో ఇంట్లొ వాళ్లతో విభేదించి బయటకు వచ్చినట్లు మల్లికా వెల్లడించారు.బాలీవుడ్ లో ఎలాగైనా రాణించాలన్న పట్టుదలతో ఇండస్ట్రీకి వచ్చానన్నారు. మొదటి వాణిజ్య ప్రకటన అమితాబ్ బచ్చన్‌తో.. రెండోది షారుఖ్ ఖాన్‌తో నటించడంతో అవకాశాలు వెల్లువెత్తాయన్నారు. మర్డర్ వంటి సినిమాల్లో ప్రధాన పాత్రలలో నటించే అవకాశం దొరికిందని మల్లికా చెప్పుకొచ్చారు.

హీరోలకు గర్ల్ ఫ్రెండ్ర్ కావాలి..

ఇక సినిమాల్లో పాత్రలు దొరకాలంటే రాజీపడాలని బాంబ్ పేల్చారు మల్లికా. హీరోలు తమ గర్ల్ ఫ్రెండ్స్ తో నటించాలనుకుంటారు. అలాంటి హీరోలతో రాజీపడకపోవడం వల్ల తాను చాలా పాత్రలను వదులుకోవాల్సి వచ్చిందన్నారు.తన వద్దకు 65 స్క్రిప్టులు వచ్చినా అందులో ఒక్క పాత్రకూ తనను తీసుకోలేదని, హీరోల కారణంగానే ఇలా జరిగిందని మల్లిక చెప్పుకొచ్చారు. ఇక బాలీవుడ్ మెగాస్టార్ నటించిన ‘గురు’ సినిమాలో ప్రాముఖ్యం ఉన్న సహయక పాత్ర తనదని.. చివరికి ఎడిటింగ్ లో తన పాత్రను తొలగించి పాటను పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది.

ఓటీటీ గొప్ప వరం..

సినినేపథ్యం లేని తనలాంటివారికి ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ గొప్ప వరమని మల్లికా తెలిపింది. ఇప్పడు ఈవేదికల వలన ఎంతోమంది వ్యక్తులకు అవకాశాలు దొరుకుతున్నాయని.. వారిలోని ప్రతిభను నిరూపించుకోవడానికి గొప్ప అవకాశం అంటూ మల్లికా వెల్లడించారు. హాలీవుడ్ కు కావాలని వెళ్లలేదని కథ నచ్చడంతో నటించినట్లు తెలిపారు. పాత్ర నచ్చితేనే చెస్తానని లేకపోతే చేయనని మల్లికా తేల్చిచెప్పారు.