చెన్నై కి షాకిచ్చిన లఖ్నవూ సూపర్ జెయింట్స్..!

ఐపీఎల్ 2022లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కి షాకిచ్చింది లఖ్నవూ సూపర్ జెయింట్స్. శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో లఖ్నవూ సూపర్ జెయింట్స్ భారీ లక్ష్యాన్ని ఛేదించి చెన్నైపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై జట్టు.. ఓపెనర్ రాబిన్ ఊతప్ప మెరుపు ఇన్నింగ్స్ (27 బంతుల్లో 50 పరుగులు) కి తోడు మొయిన్ అలీ(22 బంతుల్లో 35).. శివమ్ దుబె(30 బంతుల్లో 49)రాణించడంతో 211 భారీ లక్ష్యాన్ని లఖ్ నవూ జట్టు ముందుంచింది. ఇక బౌలర్లలో బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఆండ్రూ టై తలా రెండు వికెట్లు పడగొట్టారు.

ఇక 211 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లఖ్నవూ జట్టు.. ఓపెనర్ క్వింటన్ డికాక్(61) ఎవిన్ లూయిస్‌ (55*) అర్థ సెంచరీలు సాధించడంతో టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రాహుల్ (40) బాధ్యతాయుత ఇన్నింగ్స్ జట్టుకు కలిసొచ్చింది. చెన్నై బౌలర్లలో డ్వేన్ ప్రీటోరియస్ 2.. తుషార్ దేశ్ పాండే, బ్రావో తలా ఓ వికెట్ తీశారు.