కోల్ కతాకు బెంగుళూరు షాక్.. ఐపీఎల్ 2022లో బోణీ!

ఐపీఎల్ 15వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. గత మ్యాచ్లో 200 పరుగుల చేసి ఓటమిపాలైన ఆ జట్టు.. గురువారం కోల్కతాతో జరిగిన మ్యాచ్లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించి 3 వికెట్లతో తేడాతో విజయం సాధించింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్ కతా జట్టు.. రాయల్ చాలెంజర్స్ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 128 స్వల్ప స్కోర్ కు ఆలౌట్ అయ్యింది. ఆ జట్టులో ఆల్ రౌండర్ రసెల్ మాత్రమే (25) చెప్పుకోదగ్గ పరుగులు సాధించాడు. బెంగళూరు బౌలర్లు హసరంగ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్ దీప్ 3, హర్షల్ పటేల్ 2, సిరాజ్ ఒక వికెట్ తీశారు.
ఇక 128 పరుగులను ఛేదించే క్రమంలో బెంగుళూరు జట్టు 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆ జట్టులో అహ్మద్(27), రూథర్ఫోర్డు(28) మోస్తారు పరుగులు చేశారు. కోల్కతా బౌలర్లలో టిమ్ సౌథీ 3, ఉమేశ్ యాదవ్ 2, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలా ఓ వికెట్ పడగొట్టారు.