మధ్యప్రదేశ్‌లో కరోనా కొత్త వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. ఇండోర్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులు దీని బారిన పడ్డారని నమూనా పరీక్షలు వెల్లడించాయి. ఎవై.4 గా చెబుతన్న కరోనా వైరస్‌లోని కొత్త వేరియంట్ మధ్యప్రదేశ్‌లో పలువురికి సోకిన విషయాన్ని దేశ రాజధాని ఢిల్లీలోని జాతీయ వ్యాధి నివారణా కేంద్రం నిర్థారించింది. అయితే, ఈ కొత్త వేరియంట్ బారినపడ్డవారంతా వ్యాక్సినేషన్ తీసుకున్నావారేనని తెలిసింది. ఈ వేరియంట్ జన్యు క్రమాన్ని పరిశీలించేందుకు వ్యాధి సోకినవారి నమూనాలను ప్రయోగశాలకు పంపించారు. కొత్త వేరింట్ సోకిన బాధితులంతా చికిత్స అనంతరం కోలుకున్నట్లు మధ్యప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన అధికారి బీఎస్ సాయిత్య తెలియజేశారు.