యువకులను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు ‘నయా సవేరా’ అనే మాదకద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాన్ని రాచకొండ పోలీసులు త్వరలో పునఃప్రారంభించనున్నారు. దీని విషయమై రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఒక ప్రకటన చేశారు.
కాగా యువకులను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు రాచకొండ పోలీసులు త్వరలో ‘నయా సవేరా’ అంటే ‘నయా డాన్’ అనే డ్రగ్స్ డి-అడిక్షన్ ప్రోగ్రామ్‌ను మళ్లీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. చిన్నారులు, యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని 2017లో అమృత ఫౌండేషన్ సొసైటీ సహకారంతో ప్రారంభించి అనేక మంది చిన్నారులు, విద్యార్థులకు సమస్యలపై అవగాహన కల్పించారన్నారు. చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాల వాడకంతో, చాలా మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారనీ… డ్రగ్స్ దుర్వినియోగంపై షార్ట్ ఫిల్మ్ ‘మరో లోకం’ కూడా విడుదల చేశారని అన్నారు.
ఇక ఇప్పుడు మాదకద్రవ్యాల ముప్పును ఎదుర్కోవడంపై మరోసారి దృష్టి సారించడంతో, మేము ‘నయా సవేరా’ని మళ్లీ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన పాఠశాలలు, కళాశాలలు, హాట్‌స్పాట్‌లలో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. అమృత ఫౌండేషన్ సొసైటీతో కలిసి.. డి-అడిక్షన్ కార్యక్రమాలు కూడా వారానికి ఒకసారి నిర్వహిస్తామని… అది మంగళవారాల్లో ఉంటుందని కమిషనర్ తెలియజేశారు.